మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు కమర్షియల్ యాడ్ ఫిలంస్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. ఒక్కో యాడ్ ఫిల్మ్ కి హీరోయిన్ అయితే మూడు నుంచి నాలుగు కోట్లు హీరో అయితే రు. 5 నుంచి 10 కోట్ల వరకూ వెనకేసుకుంటున్నారు. ఇక యాంకర్స్ కూడా ఇలాంటి సంపాదనలో తక్కువేమీ కాదని చెప్పాలి. సాధారణంగా యాంకర్ అంటే అంత సంపాదన ఏమీ ఉండదనే మాట వినిపిస్తుంటుంది.
అది ఒకప్పుడు. ఉదయభాను లాంటి పాపులర్ యాంకర్ రోజుకి 5 వేల రూపాయలు తీసుకున్న సందర్భాలున్నాయి. అదే ఉదయభాను 25వేలు తీసుకునే స్థాయికి ఆ తర్వాత లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి చేరుకుంది. ఇక అడిషన్లాగా కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేస్తే వీరు 5నుంచి 10 లక్షలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రెమ్యునరేషన్ కూడా యాంకర్స్‌కి బాగా పెరిగింది. రష్మీ గౌతం, అనసూయ, వర్షిణి లాంటి వారు సీనియర్ యాంకర్ సుమ లాంటి వారు సినిమాలలోనూ చేస్తున్నారు.
దాంతో యాడ్ ఫిలింస్ కూడా మంచి ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఒప్పేసుకుంటున్నారు. రష్మీ యాడ్స్ చేస్తూ కోటి వరకూ రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక అనసూయ సోషల్ మీడియా ద్వారా బాగానే వెనకేసుకుంటుందని చెప్పుకుంటున్నారు. సినిమాలలో ఐటెం సాంగ్స్ ఇంకో రకంగా సంపాదన వచ్చే మార్గం. ఇవన్నీ పక్కన పెడితే విదేశాలలో ఈవెంట్స్ అంటే దానిలెక్క వేరేగా ఉంటుంది.
కొన్ని ప్రైవేట్ పార్టీలకి వెళ్ళి కొందరు నటీమణులు బాగానే సంపాదిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో బాగా వినిపిస్తుంది. దుబాయ్ ఈవెంట్స్ అంటే అదోరకమైన సంపాదన వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్స్‌కి పాపులర్ యాంకర్స్, హీరోయిన్స్ బాగా వెళుతుంటారట. కాస్త క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్‌కైనా దుబాయ్ ఫ్లైటెక్కే ఛాన్స్ వస్తుందని లోలోపల వినిపిస్తున్న మాట. ఏదేమైనా సంపాదనలో హీరోలకంటే హీరోయిన్స్‌కే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని అర్థమవుతోంది.