క్యాస్టింగ్ కౌచ్ అంటూ.. ప్రస్తుతం పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. తమకు ఆఫర్లు ఇవ్వాలంటే.. తమను నిర్మాతలు.. అడ్డంగా వాడుకుంటున్నారని.. రూమ్ కు రమ్మని పిలుస్తున్నారని.. కొందరు నటీ మణు లు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా ఇదే విషయం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. తాజాగా అగ్ర తార నయనతార కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ చవిచూశా నని చెప్పి సంచలనం సృష్టించింది. ఇక, ఇతర నటీమణులు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన విషయాలు కామనే..
ఇక, ఓల్డ్ మూవీల విషయానికి వస్తే.. పరిస్థితి ఏంటి? అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉండేదా లేదా? అంటే.. చెప్ప డం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటే.. స్టూడియో సంస్థలు.. అంటే జమినీ.. వాహినీ.. ఏవీఎం వంటి సంస్థలు నిర్మాతలు గా సినిమాలు తీసిన రోజుల్లో మాత్రం ఇండస్ట్రీ అంతా పద్ధతిగా మసులుకుందని చెబుతారు.
అయితే.. ఎప్పుడైతే సంస్థలు పోయి.. నిర్మాతల పెత్తనం వచ్చిందో అప్పటి నుంచి క్యాస్టింగ్ కౌచ్‌లు పెరిగి పోయాయని అంటారు. ముఖ్యంగా రెండు మూడు దశకాల్లో అయితే.. దర్శకులు రెచ్చిపోయారనేది ఒకరిద్ద రు రాసుకున్న కథనాలు.. పుస్తకాలను బట్టి తెలుస్తోంది. అందుకే.. ఒక హీరోయిన్ పేరు చెప్పగానే.. ఆమెకు.. దర్శకుడికి మధ్య.. అంటూ.. కథనాలు వచ్చేవి. సో.. ఇప్పుడున్నంత కాదు.
అప్పట్లో మీడియా ఇంత ఉండేదే కాదు. మద్రాస్ నుంచి వచ్చే కాగడా లాంటి ఒకటి రెండు పత్రికల్లో మాత్రమే ఈ ఎఫైర్, అక్రమ సంబంధాల వార్తలు వచ్చేవి. అప్పట్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉండేదని.. అయితే.. అది పరస్పర అవగాహనతోనే ఉండేదని అనేవారు. ఈ అవగాహనతో ఇద్దరు కలిసి ఈ పని చేయడంతో ఎవ్వరూ కూడా తర్వాత రగడ చేసేవారు కాదు.. అప్పట్లో ఈ విషయంపై ఓపెన్ అయితే ఇండస్ట్రీలో ఛాన్సులు ఇవ్వరన్న భయం ఉండేది.
ఇప్పుడు ఎవరికి వారు పెద్ద రచ్చ చేసేస్తున్నారు. ఇప్పుడు అవకాశం ఇవ్వలంటే.. కండిషన్ పెడుతున్నారని.. ఇటీవల శ్రీరెడ్డి వంటివారు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయనివారు కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురైన వారే. ఈ జాబితాలో జయసుధ వంటివారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించకపోదు.