టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకు తెలుగు బ్యూటీ నే అయినా సరే ఇండస్ట్రీలో అమ్మడుకు అవకాశాలు రాలేదు . ఈ క్రమంలోనే కోలీవుడ్లో మంచి మంచి అవకాశాలు సంపాదించుకున్న అంజలి .. తద్వారా వచ్చిన పాపులారిటీతో తెలుగులో సినిమా అవకాశాలు దక్కించుకుంది . మరీ ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అంజలి .. ఆ తర్వాత పలు రోల్స్ లో నటించి మెప్పించింది .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మెప్పించింది అంజలి . కాగా అంజలి రీసెంట్గా తన వాలెంటైన్స్ డే ను ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. తన పెట్ తో కలిసి లవ్ షేప్ ఉన్న సింబల్స్ ను పెడుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చాలా క్యాజువల్ వేర్ లో సింపుల్ గా బెలూన్ లతో తన లవ్ ను చెప్పకు వచ్చింది .
ఈ క్రమంలోనే అంజలి మరోసారి ప్రేమలో పడింది అంటూ చెప్పకనే చెప్పేసింది.. అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అంజలి గతంలో కోలీవుడ్ స్టార్ హీరో జై తో ప్రేమాయణం నడిపిందని .. అతగాడు ఆమెను వాడుకొని వదిలేసాడని .. ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించని అంజలి రీసెంట్గా ఎవరితో ప్రేమలో పడిందా అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు జనాలు . చూద్దాం ఈ విషయంపై అంజలి ఎలా స్పందిస్తుందో
..అంజలి మనసు దోచుకున్న ఆ నవ మన్మధుడు ఎవరో..?