ఏంటో ..ఈ మధ్యకాలంలో చిన్న విషయాన్ని కూడా పెద్ద బూతులా క్రియేట్ చేసేస్తున్నారు జనాలు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మాట మాట్లాడాలన్న భయంతో వణికిపోతున్నారు స్టార్ సెలబ్రిటీస్ . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ని ఏవిధంగా ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారో తెలిసిందే. రీసెంట్గా అదే లిస్టులో కి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని . నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాచురల్ స్టార్ హీరోగా ..క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . ఆయన చూస్ చేసుకునే సినిమాలన్నీ కూడా మిడిల్ క్లాస్ కి సంబంధించినవిగానే ఉంటాయి .
కాగా రీసెంట్గా నాని నటిస్తున్న సినిమా దసరా . ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ టీజర్ జనాలను అమితంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్ లో నాని తెలంగాణ యాశలో మాట్లాడి మెప్పించాడు. ఈ టీజర్ లో తెలంగాణ భాషలో చెప్పిన ఓ పదమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టీజర్ లో వచ్చిన “బాంచత్” అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆ పదం వాడకాన్ని ఎవరు పెద్దగా తప్పు పట్టడం లేదు .. కానీ దాన్ని వాడాలని చెప్పిన నాని.. ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తున్నాడు.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి” ఓరి వారి” అనే పాట విడుదలైంది . ఈ సందర్భంగా ఈవెంట్ లో మాట్లాడుతున్న నానికి “బాంచత్” అనే పదాన్ని ఎలా వాడుతారు అంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఇదే క్రమంలో నాని టంగ్ స్లిప్ అవుతూ అందులో తప్పు లేదని ..అది కామన్ గా వాడే పదం అని ..దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు . అంతేనా అక్కడితో ఆగకుండా ఆ బూతు పదాన్ని అందరూ వాడాలని.. ఆ పదాన్ని స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవాలి అంటూ విచిత్రమైన వాదనకు తెరలేపారు. ఇక్కడే నాని అడ్డంగా ఇరుక్కుపోయాడు . అలాంటి పదాన్ని స్కూల్ పిల్లలు వాడాలన్న మాట నీ నోటి నుంచి ఎలా వస్తుంది నాని అంటూ మండిపడుతున్నారు జనాలు. దీంతో నాని దసరా సినిమా కాంట్రవర్షియల్ గా మారిపోయింది..!!