భానుమతి.. రామకృష్ణ.. ఇద్దరూ కూడా దంపతులు. పైగా సినీ రంగంతోనూ పరిచయం ఉన్నవారు. నేటి త రానికి.. అప్పటి తరానికి కూడా భానుమతి అంటే తెలుసు. కానీ, రామకృష్ణ అంటే పెద్దగా తెలియదు. మరి ఈయన ఎవరు? ఎలా పరిచయం అయ్యారు? అనేది పెద్ద ఆసక్తికర విషయం. రామకృష్ణ సహాయ దర్శకు డుగా సినీరంగంలోకి ప్రవేశించారు. బీఎన్ రెడ్డి వంటి అప్పటి దిగ్గజ దర్శకుడి వద్ద ఆయన పనిచేశారు.
ఈ క్రమంలోనే వేదాంతం రాఘవయ్యతోనూ పనిచేశారు. ఇలా.. పనిచేస్తున్న క్రమంలోనే భానుమతితో ఆయనకు పరిచయం అయింది. వాస్తవానికి మగగాలి తగలకుండా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే భానుమతి.. అనూహ్యంగా రామకృష్ణతో ప్రేమలో పడడం వెనుక.. పెద్దరీజనే ఉందని అంటారు. వేదాంతం రాఘవయ్య సూచనలతో ఆమె.. రామకృష్ణను వివాహం చేసుకున్నారట. ఇద్దరూ కూడా మంచి అవగాహన ఉన్నవారు కావడం గమనార్హం.
అంతేకాదు.. ఇద్దరూ కూడా సనాతన సంప్రదాయం ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు. దీంతో ఇరువురి మనసులు కూడా చేరువ అయ్యాయి. వీరి వివాహానికి ఎన్టీఆర్ పెద్దగా వ్యవహరించారని టాలీవుడ్‌లో టాక్. ఇక, ఏర్పాట్లను అక్కినేని వారు చూసుకున్నారని.. భానుమతి ఫ్యామిలీ కేవలం పెళ్లికే పరిమితం అయిందని.. ఆహ్వానితులను రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అందరూ తలాచేయి వేశారట.
ఇక, దాంపత్య జీవితంలో రామకృష్ణతో కలిసి.. భానుమతి అనేక రంగాల్లో విస్తరించారు. సినిమా నిర్మాణం నుంచి దర్శకత్వం వరకు.. అనేక పాత్రలు పోషించారు. కకుటుంబాన్ని నడిపించడంలోనూ.. భానుమతి కీలకంగా వ్యవహరించారు. భరణి పిక్చర్స్‌ను స్థాపించి.. అనేక అజరామరమైన చిత్రాలను నిర్మించారు. సో.. మొత్తానికి భానుమతి మాత్రమే తెలిసినా.. ఆమె జీవితంలో కీలమైన రామకృష్ణ పాత్ర కూడా ఎంతో ముఖ్యం.