టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయమే . ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు పారితోషికం అందుకుంటూ.. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నవే. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు. ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సాహో, రాధే శ్యామ్ రెండు డిజాస్టర్ గా మారాయి .
సాహో యాక్షన్స్ పరంగా పర్వాలేదనిపించినా.. రాధే శ్యామ్ మరింతగా రెబల్ అభిమానులను డిసప్పాయింట్ చేసింది . ప్రభాస్ తో రాధేశ్యామ్ చేసిన డైరెక్టర్ని ఫాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు . ఈ క్రమంలోనే డైరెక్టర్ రాధాకృష్ణ తనదైన స్టైల్ లో అభిమానులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. ఫ్యాన్స్ భారీ ఎత్తున అతని పేరుని ట్రోల్ చేశారు . అయితే కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న రాధాకృష్ణ.. ప్రెసెంట్ గోపీచంద్ తో ఒక క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది .
అయితే ఈ ప్రాజెక్టు ఫైనల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. రాధే శ్యామ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రాధాకృష్ణకు .. మళ్ళీ ఎలాగైన హిట్ ఇవ్వాలని ప్రభాస్ దగ్గరుండి గోపీచంద్ తో సినిమాను ఫైనల్ చేశారట. అంతేకాదు దీనికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభాస్ .. రాధాకృష్ణ – గోపీచంద్ కు దగ్గరుండి అన్ని విషయాలను వివరిస్తున్నారట. తన వల్ల ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్ కి హిట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ప్రభాస్ అంటూ ఇదే నిజమైన హీరోయిజం అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు .