ప్రస్తుతం తెలుగులో చాలామంది హీరోయిన్లు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా కెరీర్ ను కొనసాగించలేకపోతున్నారు. వరుసగా రెండు ఫ్లాపులు వస్తే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ అని ఇండస్ట్రీ ముద్ర వేస్తోంది. అయితే హీరోయిన్ శ్రియ మాత్రం 23 సంవత్సరాల నుంచి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. కథ నచ్చితే తల్లి పాత్రలలో నటించడానికి కూడా ఓకే చెబుతుండటంతో శ్రియకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ పాత్ర నిడివి తక్కువే అయినా తన పాత్రకు ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అయితే శ్రియ కుటుంబం గురించి ఆమె అభిమానులలో చాలామందికి కూడా ఎక్కువగా తెలియదు. ఒక ఇంటర్వ్యూలో శ్రియ మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ కు అమ్మపై క్రష్ ఉండేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. డ్యాన్స్ అంటే శ్రియకు ఇష్టం కాగా ఆమె కాలేజ్ లో డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చారనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించిన శ్రియ బాల్యంలో కొంచెం బొద్దుగా ఉండేదానినని కామెంట్లు చేశారు. మా అమ్మ చాలా అందంగా ఉండేవారని ఆమె కెమిస్ట్రీ టీచర్ అని స్కూల్ లో హాటెస్ట్ టీచర్ తన తల్లి అని శ్రియ చెప్పుకొచ్చారు. నా ఫ్రెండ్స్ కు కూడా అమ్మ అంటే క్రష్ ఉండేదని శ్రియ తెలిపారు. షీ ఈజ్ వెరీ వెరీ హాట్ అంటూ శ్రియ ఒకింత షాకింగ్ కామెంట్స్ చేశారు.
మా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఈ విషయం చెప్పారని శ్రియ అన్నారు. తన ఫ్రెండ్స్ అమ్మ దగ్గరకు వెళ్లి సిల్లీ ప్రశ్నలు అడిగేవారని ఆమె పేర్కొన్నారు. శ్రియ తల్లి పేరు నీరజ సరన్ కాగా శ్రియ సినిమాలలో సక్సెస్ కావడం వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. అయితే తన తల్లి హాటెస్ట్ టీచర్ అంటూ శ్రియ చేసిన కామెంట్ల గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రియ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తుండటం ఆమెకు ప్లస్ అవుతోంది.
ఆ జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో కలిసి నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హీరోయిన్లలో శ్రియ ఒకరు. పాత్రకు అనుగుణంగా పారితోషికం తీసుకోవడం, వివాదాలకు దూరంగా ఉండటం, దర్శకుల అభిరుచికి అనుగుణంగా నటించడం వల్ల శ్రియకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్ తొలినాళ్లలో అమాయకంగా ఉండే రోల్స్ లో ఎక్కువగా నటించిన శ్రియ ప్రస్తుతం కథ డిమాండ్ చేస్తే బోల్డ్ రోల్స్ లో నటించడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.