నిజమే! కొన్ని కొన్ని విషయాల్లో డైరెక్టర్లు చాలా చొరవ చూపించిన సందర్భాలు ఉండేవి. క్యాస్టింగ్ కౌచ్ వంటి పెద్ద పెద్ద పదాలు ఇప్పుడు వాడుతున్నారు కానీ.. గతంలోనూ ఇవి ఉండేవి. అయితే.. ఇవి సున్ని తంగా ఉండేవి. బాలచందర్, కే విశ్వనాథ్. వంటి దిగ్గజ దర్శకులు.. సినిమాలపై ప్రాణం పెట్టుకునేవారు. వారి దృష్టిలో సినిమా సాంఘికమైనా.. సమాజానికి ఉపయోగపడే చిత్రమైనా.. ఒక్కటే. ఒక కళాఖండంగా చిత్రాన్ని నిర్మించాలని తపన పడేవారు.
ఈ క్రమంలో హీరో హీరోయిన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ఆహార్యం బాగుండాలని తపన పడేవారు. సీతాకోక చిలుక, సీతామాలక్ష్మి, సిరిసిరి మువ్వ వంటి చిత్రాలను గమనిస్తే.. ఇవి సాంఘిక సినిమాలే అయి నప్పటికీ. కళాత్మకతకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా హీరోయిన్లను చాలా వరకు అందంగా చూపించే ప్రయత్నాలు చేశారు. అలాగని ఎక్కడా స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవా ల్సింది.. వారు ధరించిన వస్త్రధారణే!
ఆకట్టుకునేలా వస్త్రధారణ ఉండాల్సిందనేనని పంతం పట్టిన డైరెక్టర్లలో బాలచందర్, బాలు మహేంద్ర (తమిళం), కే విశ్వనాథ్, వంశీ (కొన్ని చిత్రాల్లో పాటించారు) వంటివారు చాలా ముఖ్యం. వీరు ప్రత్యేకంగా.. కొన్ని డిజైన్లను ఎంపిక చేసేవారు. హీరోయిన్ను నప్పే వస్త్రాల కోసం స్వయంగా షాపింగ్ చేసిన డైరెక్టర్ విశ్వనాథ్. ఈయన ఎంపిక స్వయంగా ఉండేది. సహజంగా కాస్ట్యూమ్ కు డిజైనర్ ఉంటారు. కానీ, విశ్వనాథ్, బాలచందర్ సినిమాల్లో మెజారిటీ కాస్ట్యూమ్ అంతా కూడా .. వారే చూసుకునేవారు.
అంతేకాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే.. హీరోయిన్లకు స్వయంగా వస్త్రాలు కట్టిన డైరెక్టర్‌గా కే విశ్వనాథ్ పేరు చెప్పుకొనేవారు. వారు ఇన్నర్ డ్రస్‌తో ఉంటే.. ఆయనే తనకు కావాల్సిన రీతిలో వారికి దుస్తులు కట్టేవారట. సెట్లోనే ఇవన్నీ జరిగేవని చెప్పుకొనేవారు. శంకరా భరణం సినిమాలో.. ఇలానే జరిగింది. తర్వాత.. వచ్చిన సప్తపది సినిమాలోనూ విశ్వనాథే అన్నీ చూసుకునేవారట. ఇదీ.. సంగతి! దీనిలో కళాత్మక తప్ప.. మరో కోణం ఉండేది కాదు. అందుకే అప్పట్లోల సినిమాలు ఇప్పటికీ చరిత్రగా నిలిచిపోయాయి.