సినిమా ఇండస్ట్రీలో మహిళలకు కెరీర్ తక్కువ. ఇక్కడ లాంగ్ రన్లో హీరోయిన్గా కొనసాగాలంటే పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి.. గ్లామర్ షో విషయంలో అడ్డు అదుపు ఉండకూడదు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రం లాంగ్ రన్‌లోనూ కెరీర్ కొనసాగించారు. కొందరు హీరోయిన్లకు కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లు పడి.. తిరుగులేని స్టార్డమ్ వచ్చినా దానిని కంటిన్యూ చేయలేక త్వరగానే ఫేడవుట్ అయిపోయారు.
ఎన్టీఆర్ కెరీర్లో రెండో సినిమాగా వచ్చిన ఆది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఆది ఓ సంచలనం. వివి. వినాయక్‌కు అది తొలిసినిమా. కీర్తీచావ్లా హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ సినిమా ఎన్టీఆర్‌కు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో హీరోయిన్గా కీర్తికి, చలపతిరావుకూ అంతే పేరు తెచ్చింది. అంత గొప్ప బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి దానిని యూజ్ చేసుకోలేకపోయింది.
తొలి సినిమా టైంకే ఆమె చాలా బొద్దుగా లావుగా ఉండేది. తర్వాత ఆమె తన ఫిజిక్ మెయింటైన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. బాగా ఒళ్లు చేసేసింది. ఎన్టీఆర్ పక్కన బ్లాక్ బస్టర్ సినిమా. ఆ తర్వాత ఆమెకు పేరున్న పెద్ద హీరోల సినిమాల్లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. నాగార్జున పక్కన మన్మథుడు సినిమాలో ఓ చిన్న బిట్లో మాత్రమే మెరిసింది.
బాగా లావెక్కి పోవడంతో ఆమెను తీసుకునేందుకు టాలీవుడ్ మేకర్స్ ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన కాశి సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైం స్టోరీ, సాధ్యంతో పాటు తమిళ్, హిందీ సినిమాలు చేసినా లావెక్కి పోవడంతో సినీ లవర్స్ ఆమెను పట్టించుకోలేదు.
కానీ ఆమె ఓ మోస్తరు బొద్దుగా ఫిజిక్ మెయింటైన్ చేసి ఉంటే హన్సిక లాగా కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉండేది. అది చేయకపోవడంతో ఆమె కెరీర్ ఆమెకు ఆమే చేజేతులా నాశనం చేసుకుంది. అయితే రీసెంట్గా కీర్తి ఫొటోలు బయటకు వచ్చాయి. అసలు ఆమెను చూస్తే ఏ మాత్రం గుర్తు పట్టలేనంత లావెక్కిపోయింది. ఆమె చివరగా 2016లో ఓ తమిళ్ సినిమాలో కనిపించింది.