ఈ మధ్య వరుస హిట్ల తో జోరుమీద ఉన్న కాజల్ పెళ్లి గురించి, తనను చేసుకోబోయే వాడు అలా ఉండ్లాయ్ ఇలా ఉండాలి అంటూ చాలానే సంగతులు చెప్పుకొచ్చేసింది ఈ చందమామ. ఈ సంవత్సరం ఖైదీ నెంబర్ 150 తో మొదలు మెర్సల్ దాక మొత్తం నాలుగు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న కాజల్ అగర్వాల్ మంచి ఉత్సాహం మీద ఉంది.
ముఖ్యంగా చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించడం, ఆయనతో కలిసి స్టెప్పేసే అవకాశం రావడం లాంటివి తనకి ఈ ఏడాది మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. అలాగే విజయ మెర్సల్ లో కాజల్ హిరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగులో ‘అదిరింది’ పేరిట రిలీజైంది. ‘అదిరింది’ తర్వాత ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎంఎల్ఏ, క్వీన్ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్'( బాలీవుడ్‌లో హిట్ అయిన క్వీన్ సినిమాకు ఇది తమిళ రీమేక్ వెర్షన్) చిత్రాలకి సైన్ చేసింది. చేతిలో ఇంకా అవకాశాలు వుండటంతో అప్పుడే పెళ్లి చేసుకోనని, కాకపోతే వివాహ వ్యవస్థపై తనకి బలమైన నమ్మకం మాత్రం వుందని చెబుతోంది ఈ ముద్దు గుమ్మ.
తనకి కాబోయే వాడు పెద్ద అందగాడు కాకపోయినా పర్వాలేదు కానీ తనను తనని బాగా చూసుకునే మంచి మనసున్న, నిజాయితీగల మనిషి అయితే చాలు అని తనకు కాబోయే భర్తకు వుండాల్సిన లక్షణాలను గురించి చెప్పుకొచ్చింది కాజల్. తనకి పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ తెలివైన సమాధానంతో తప్పించుకుంది ఈ కొంటెపిల్ల.