Moviesఅయ్యయ్యో..చికిత్స లేని వ్యాధి తో బాధపడుతున్న భానుప్రియ..అఖరికి అది కూడా పనిచేయట్లేదా..!!

అయ్యయ్యో..చికిత్స లేని వ్యాధి తో బాధపడుతున్న భానుప్రియ..అఖరికి అది కూడా పనిచేయట్లేదా..!!

భానుప్రియ .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తన పేరుకు పరిచయాలు అవసరం లేకుండా చేసుకున్న ముద్దుగుమ్మలలో ఈమె ముందు వరుసలో ఉంటుంది . స్టార్ హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన భానుప్రియ .. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోస్ తో జతకట్టి నటించింది. మరీ ముఖ్యంగా డాన్స్ కు పెద్దపీట వేస్తూ భానుప్రియ తీసుకున్న కంటెంట్ ఉన్న సినిమాలు అప్పట్లో హైలెట్ గా మారాయి. చేసిన అన్ని సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్గా అప్పట్లో రాజ్యమేలేసింది.

కేవలం హీరోయిన్ గానే కాదు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించి మెప్పించింది . భానుప్రియ అంటే చాలు 80, 90 స్ లో ఉండే కిడ్స్ కి కూడా అందమైన కళ్ళు గుర్తొస్తాయి . అంతలా ఆమె కళ్ళతో అట్రాక్ట్ చేసి నెమలిలా నాట్యమాడుతూ తన నాట్యంతోనే ఇండస్ట్రీని షే చేసింది . కెమెరా ఫ్రేములకు సైతం దొరకని ఆమె వేగం అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది . హీరోయిన్గా దాదాపు దశాబ్దానికి పైగా చేసి ఇండస్ట్రీని ఏలేసిన భానుప్రియ.. ప్రజెంట్ అరుదైన వ్యాధితో బాధపడుతుంది.

రీసెంట్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన భానుప్రియ .. తన పర్సనల్ అండ్ సినీ లైఫ్ గురించి ఓపెన్ అప్ అయింది . ఈ క్రమంలోనే ఆమెకు మెమోరీ లాస్ లాంటి వ్యాధి ఉంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. భానుప్రియ మాట్లాడుతూ..” ఈ వ్యాధి నాకు ఎలా వచ్చిందో నాకే తెలియడం లేదు . మా వారు చనిపోయారు . అప్పటినుంచి నాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి . ముఖ్యంగా నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది . అసలు నాకు ఏమీ గుర్తు ఉండట్లేదు.

ఓ ముద్ర చూసి అది దేనికి సంబంధించి అని చెప్పడం కూడా నాకు కష్టంగా ఉంది . అసలు డాన్స్ అయితే మర్చిపోయాను . ఆ కారణంగానే నా డ్రీం ప్రాజెక్ట్ అయినా డాన్స్ స్కూల్ ని కూడా ఆపేసుకున్నాను . అయితే నాకు తెలుసు ఈ జబ్బుకి సరైన చికిత్స లేదని ..కానీ కాలంతో పాటు నేను ముందుకెళ్తున్నాను ” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలోనే భానుప్రియ జబ్బు తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . దేవుడు నీకు ఆ వ్యాధి తగ్గించాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news