తెలుగు సినిమాకు 80 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్యానంతరం తెలుగు సినిమా క్రమక్రమంగా ఎదుగుతూ వస్తోంది. 1960వ దశంలో తెలుగు సినిమా నుంచి మంచి సినిమాలు రావడం ప్రారంభమైంది. ఇప్పటికీ తెలుగు సినిమా ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది హీరోలు వచ్చారు.. స్టార్ హీరోలుగా ఎదిగారు.. ఎన్నో సూపర్హిట్ లో కొట్టారు.. ఎన్నో రికార్డులు తారుమారు చేశారు. నందమూరి – అక్కినేని లాంటి కుటుంబాల నుంచి మూడోతరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు
తెలుగు సినిమా చరిత్రలో ఎంతమంది హీరోలు వచ్చినా.. ఎన్ని రికార్డులు మారినా… ఒక గొప్ప రికార్డు మాత్రం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉంది. ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో అలాంటి గొప్ప రికార్డు ఒక ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. భవిష్యత్తులో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రికార్డు తిరగరాసే హీరో కూడా పుట్టడంటే అతియోశక్తి కాదేమో..!
ఎన్టీఆర్ 20 ఏళ్లకే స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలను సైతం భయపెట్టాడు. సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా సినిమాలో నటించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా రక్షిత హీరోయిన్‌గా నటించింది. 2004 నూతన సంవత్సరం కనుక జనవరి 1న చాలా గ్రాండ్‌గా ఆంధ్రావాలా సినిమా రిలీజ్ అయింది.
పైగా సింహాద్రి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆంధ్రావాలాపై లెక్కకు మిక్కిలిగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సీనియర్ ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో జరిగింది. నిమ్మకూరు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో పామర్రు మండలంలో ఉంది.
2003, డిసెంబరు 5న జరిగిన ఈ ఫంక్షన్‌కు నాటి సమైక్యాంధ్రలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపారు.
ఈ వేడక కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా వచ్చారు. అలాగే మధ్యలో ఆగిపోయిన వాళ్లు మరో రెండు, మూడు లక్షల మంది ఉంటారు. నిమ్మకూరు కిక్కిరిసి పోయింది. ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని 2004 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ కోసం ఈ ఫంక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. అసలు ఈ ఫంక్షన్ కవరేజ్ కోసం నేషనల్ మీడియా కూడా ఢిల్లీ నుంచి తరలివచ్చింది.
ఎన్టీఆర్ క్రేజ్ చూసి ఆంధ్రదేశం అంతా ఊగిపోయింది. 20 ఏళ్ల కుర్రాడికి ఈ క్రేజ్ ఏంట్రా అని అందరూ షాక్ అయిపోయారు. సినిమా, రాజకీయ వర్గాల్లోనూ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాడు. అసలు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ హెలీకాఫ్టర్‌లో ప్రాంగణానికి వచ్చాడు. ఓ తెలుగు సినిమా పాటల రిలీజ్ ఫంక్షన్ ఈ రేంజ్‌లో జరగడం టాలీవుడ్ హిస్టరీలోనే రికార్డుగా నిలిచిపోయింది. అసలు ఈ రికార్డ్ కొట్టే హీరో భవిష్యత్తులో కూడా రాడనే చెప్పాలి. అంత గొప్పగా ఆ కార్యక్రమం జరిగింది.