టాలీవుడ్‌లో ఇప్పుడు కాంబినేషన్లు చూపించి డబ్బులు చేసుకోవడం బాగా జరుగుతోంది. అసలు కథ, కథనాలను పక్కన పెట్టేసి.. స్టార్ హీరో, హీరోయిన్, దర్శకుడు కాంబినేషన్లు చూపించేసి అమ్మేసుకుంటున్నారు. ఇది చాలా మంది హీరోలకు జరుగుతోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు కూడా ఇదే సూత్రం ఫాలో అయ్యి బిజినెస్ చేస్తున్నారు.
సినిమా హిట్ అయితే ఎవ్వరికి వచ్చిన ఇబ్బంది లేదు. తేడా వస్తే పోయేది మాత్రం మహేష్‌బాబు పరువే. ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ పవన్, త్రివిక్రమ్ కాంబోలో అజ్ఞాతవాసి తీసి కళ్లు చెదిరిపోయే రేట్లకు అమ్మేసింది. సినిమా డిజాస్టర్. ఇక వచ్చిన లాభంలో కొంత తిరిగి వెనక్కు ఇచ్చారు.
ఇప్పుడు మహేష్ సినిమాను కూడా ఒక్క నైజాం ఏరియాకే ఏకంగా రు. 45 కోట్లకు దిల్ రాజుకు అమ్మేశారు. ఈ సినిమా రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉండడంతో రాజు కూడా చాలా ఎక్కువ కోట్ చేసి మరీ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన పోటీ నేపథ్యంలో రాజు ఎక్కువ రేటు పెట్టి ఉండవచ్చు.. కానీ ఏ బేస్ మీద ఇంతకు అమ్మారు అన్నది అర్థం కాని పరిస్థితి.
కేవలం త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం వసూళ్లు చూసే. ఆ సినిమా నైజాంలో ఏకంగా రు. 45 కోట్ల వసూళ్లు రాబట్టింది. అది నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసేంత పెద్ద హిట్. అయితే ఇప్పుడు ఆ వసూళ్లు చూపించి.. మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు కూడా అంతే వస్తుందని కాకి లెక్కలు వేసుకుని అదే రేట్లకు అమ్మేస్తున్నారు. అసలు మహేష్ చివరి రెండు సినిమాల లెక్కలు ఓ సారి చూస్తే సర్కారు వారి పాట రు. 30 కోట్లను టచ్ చేసి ఆగిపోయింది.
సరిలేరు నీకెవ్వరు నైజాంలో రు. 35 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ రెండు పేద్ద హిట్ అని చెప్పుకున్నారు. మరి ఏ లెక్కన నైజాంలో మహేష్ – త్రివిక్రమ్ సినిమాను రు. 45 కోట్లకు అమ్మారో వాళ్లకే తెలియాలి. దిల్ రాజు మాత్రం పట్టుబట్టి రైట్స్ కోసం ఎక్కువ రేటు పెట్టి ఉండొచ్చు.. కానీ రేపు సినిమా ఫట్ అయితే పోయేది మహేష్ పరువే. అప్పుడు యాంటీ ఫ్యాన్స్ అందరూ ఓ ఆటాడుకుంటారు.
బ్రహ్మోత్సవం టైంలో ఏం జరిగిందో చూశాం. ఏదేమైనా మార్కెట్ ను మించి ఎక్కువ రేట్లకు అమ్మడం ఏ మాత్రం సరికాదు. మరి దీనిని మన టాలీవుడ్ మేకర్స్ ఎప్పటకీ తెలుసుకుంటారో ?