మహానటి కీర్తి సురేష్ టాలీవుడ్లో మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించినా.. ఆ సినిమాతో ఆమె సౌత్ ఇండియా వైజ్‌గా సూపర్ పాపులర్ అయినా ఎందుకో ఆమెకు కమర్షియల్ హీరోయిన్గా రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. మహేష్‌బాబుతో గతేడాది సర్కారువారి పాట సినిమాలో నటించింది. అయినా ఆ తర్వాత ఆమెకు స్టార్ హీరోలు ఏం ఛాన్సులు ఇవ్వడం లేదు.
ముందునుంచి కీర్తి ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. సర్కారువారి పాట సినిమాలో అందం ఆరబోసే విషయంలో కాస్త గేట్లు ఎత్తేసింది. అయినా ఎందుకో వర్కవుట్ కాలేదు. ఆమె క్రేజ్ ఉన్నప్పుడు కమర్షియల్ పంథాకు, అందాల ఆరబోతకు దూరంగా ఉంది. ఇప్పుడు అన్నీ చూపిస్తాను అంటున్నా ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు.
తాజాగా కీర్తి సురేష్ ఛాన్స్ వస్తే చాలు హాట్ హాట్‌గా అందాలు చూపించేందుకు తాపత్రయ పడుతోంది. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లికి హాజరైన కీర్తి సురేష్ సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఈ వేడుకలో అందరికంటే ఎక్కువ ఆకర్షణగా నిలిచినా నెటిజన్ల నుంచి ఆమెపై భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.
కీర్తి వేసుకున్న ఈ డ్రెస్ మనం ఫంక్షన్లలో పలు రకాల డ్రెస్సులు కలిపి వాడే షామియానా టెంటులా ఉంది. దీంతో ఈ పిక్‌పై చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దుస్తులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుదని మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. షామియానా బేబీ అంటే మాకు చాలా ఇష్టం.. మీరు ఆ షామియానా వస్త్రాలతోనే ఈ దుస్తులు కుట్టించుకుని ఉంటారని ఆడుకుంటున్నారు. ఏదేమైనా ఈ డ్రెస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.