Moviesమహేశ్ కోసం దిగి వచ్చిన డైరెక్టర్ భార్య.. త్రివిక్రమ్ మాములోడు కాదురా...

మహేశ్ కోసం దిగి వచ్చిన డైరెక్టర్ భార్య.. త్రివిక్రమ్ మాములోడు కాదురా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో సినిమా ను తెరకెక్కించడం కన్నా సినిమాని ప్రమోట్ చేసుకోవడం ..ఆ సినిమాలో నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే అసలు ట్రిక్ దాగుంది . సినిమాను తెరకెక్కించడం ఎలాంటి వారైనా చేస్తారు . కానీ జనాల నాడి పట్టి ఎలాంటి విధంగా కాంబో సెట్ చేయాలి అన్నది మాత్రం స్టార్ డైరెక్టర్ కె అర్థమవుతుంది . వాళ్లలో ఒకరే త్రివిక్రమ్ శ్రీనివాసరావు . ఈయనని మాటలు మాంత్రికుడు అంటూ జనాలు ట్రెండ్ చేస్తూ ఉంటారు .

ఈయన సినిమా నుంచి వచ్చిన ప్రతి డైలాగ్ ఏ రేంజ్ లో పేలుతుందో అందరికీ తెలిసిందే . అంతెందుకు భీమ్లా నాయక్ సినిమాకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒక్కొక్క డైలాగ్ను ఎంత పవర్ఫుల్ గా రాసారో ..ఎవరికి టచ్ అవ్వాలని గుచ్చుకోవాలని రాశారో.. అలాగే జరిగింది . అంతేనా ఇప్పటికీ ఆయన డైలాగులు రాసిన సినిమాలు టీవీలో వస్తే ఎంజాయ్ చేస్తూ చూస్తాం.

శ్రీనివాసరావు ప్రెసెంట్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఎస్ఎస్ఎంబి 28 టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ట్రై చేస్తుంది . కాగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయింది . సెకండ్ హీరోయిన్గా శ్రీలీల కన్ఫామ్ అయినట్టే .. ఇప్పుడు ఈ సినిమాల్లో మరో సీనియర్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ . సినిమాను మలుపు తిప్పే పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

నిజానికి ఈ పాత్రలో శోభనను అనుకున్నారట కానీ ఆమె ఇంకా అగ్రిమెంట్ పై సైన్ చేయలేదని .. ఈ క్రమంలోనే సెకండ్ ఆప్షన్ కింద రమ్యకృష్ణను పెట్టుకున్నారని.. ఒకవేళ శోభన రిజెక్ట్ చేస్తే మాత్రం ఆఫర్ ఖచ్చితంగా రమ్యకృష్ణ కే దక్కుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం తెరపై మహేష్ బాబు – రమ్యకృష్ణ ఒకే స్క్రీన్ లో చూస్తే జనాలకు పూనకాలు రావాల్సిందే అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news