యంగ్ హీరో సందీప్‌కిషన్‌కు ఇటీవల తన స్థాయికి తగిన హిట్ ఒక్కటి రావడం లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ వరుసగా ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ నటించిన నక్షత్రం సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఇక తాజాగా సందీప్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన సినిమా C/o సూర్య.
రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ సుసీంద్రన్ దర్శకత్వం వహించారు. సుసీంద్రన్ సినిమాలంటేనే స్క్రీన్ ప్లే వైవిధ్యంగా ఉంటుంది. ట్విస్టులు.. అలాగే ఎమోషన్ భలే పీక్స్ లో ఉంటుంది. ‘నా పేరు సూర్య’ ‘పల్నాడు’ వంటి సినిమాలను చూస్తే ఆ విషయం అర్దమవుతుంది. ఇక మ్యాటర్ ఏంటంటే సుసీంద్రన్ – సందీప్ కాంబోలో తెరకెక్కిన C/o సూర్య సినిమాకు ఇప్పటికే చెన్నైలో మీడియా వాళ్లకు ప్రీమియర్ షో వేశారు.
సినిమాగా సూపర్‌గా ఉందంటూ జర్నలిస్టులు ట్విట్టర్లతో పాజిటివ్ రివ్యూలు హోరెత్తించేస్తున్నారు. విపరీతమైన పాజిటివ్ గా రివ్యూస్ రావడంతో.. సందీప్ అండ్ సుసీంద్రన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు టాక్ బాగున్నా తెలుగులో రిజల్ట్ ఎలా ఉంటుందో ? అన్న టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంది.
ఈ వీకెండ్లో తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే థియేటర్లలో రాజశేఖర్ గరుడవేగ స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. ఇక విజయ్ అదిరింది, మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు, విశాల్ డిటెక్టివ్ కూడా రిలీజవుతున్నాయి. అంటే నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఈ లెక్కన థియేటర్ల కొరత చాలానే ఉంటుంది. థియేటర్లు సరిపోకే సిద్ధార్థ్ గృహం వాయిదా పడింది. మరి ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాకు ఎలాగూ అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా , వసూళ్లు ఎలా ఉంటాయన్న టెన్షన్ అందరిలోను ఉంది.