గుడికి వెళ్ళామా అంటే వెళ్ళాము అన్నట్లు కాకుండా దేవుని సందర్శించుకునే సమయంలో ప్రతీ ఒక్కరు పాటించాల్సిన కొన్ని నియమాలను మన పెద్దవారు నిర్ణయించారు. ఈ సూపర్ ఫాస్ట్ రోజుల్లో మనకు మనః శాంతి లభించాలంటే మొదటగా అందరికి గుర్తుకువచ్చేది గుడి మాత్రమే అంటే సందేహం లేదు. అటువంటి గుడిలో సందర్శన కూడా హడావిడిగా కాకుండగా ఒక పద్దతిలో చేసుకొని అసలైన మనఃశాంతి పొందండి.
మొదటగా పుష్కరిణిలో స్నానం చేయాలి.
బొట్టుపెట్టుకుని క్షేత్రపాలకుడుని దర్శించాలి.
గుడి ప్రదక్షిణం తర్వాత ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి
.ఆ తరువాత ముఖమండపంలో గరుడు ని లేదా నంది ని లేదా ఆంజనేయస్వామి ని దర్శించాలి.అది విష్ణు ఆలయమైతే ఆళ్వారులను దర్శించాలి.
తరువాత అమ్మవారిని దర్శించి ద్వారపాలకులు నమఃస్కరించి గర్భగుడిలో స్వామిని(మూలవిరాట్టుని)పూజించాలి.
భక్తితో స్వామి రూపధ్యానం చేయాలి.స్వామి మంగళ హారతికి నమఃస్కరించి తీర్థప్రసాదాలు స్వీకరించి ముఖమండపంలోకాసేపు కూర్చొని, మానసిక ప్రశాంతతను అనుభవించి లేచి వెలుపలికి రావాలి.ఇలా చేస్తే ఆలయ దర్శనం మనశాంతినిస్తుంది.