హమ్మయ్య.. ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కొద్ది గంటల ముందు ఆయన ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇన్నాళ్లు పెళ్లి అంటే పడదు అంటూ దూరంగా ఉన్న శర్వానంద్ రీసెంట్గా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . ఈ నిశ్చితార్థ వేడుకకు చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు .
వాళ్ళలో ఒకరే రామ్ చరణ్ – ఉపాసన దంపతులు . కాగా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో శర్వానంద్ పెళ్లి వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాటికి చెక్ పెడుతూ అఫీషియల్‌గా తన కాబోయే భార్యను పరిచయం చేశాడు శర్వానంద్. శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు రక్షిత రెడ్డి . ఈమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈమె .
కాగా వీళ్ల ప్రేమ యవ్వారం చాలా నెలల నుంచి నడుస్తుంది . అయితేఅన్ స్టాపబుల్ షో కి వచ్చినప్పుడు బాలయ్య అడిగిన టంగ్ స్లిప్ అవ్వని శర్వానంద్.. ప్రభాస అడిగినా కూడా ఎక్కడ ఆన్సర్ చెప్పలేదు . ఈ క్రమంలోనే తనని బుక్ చేస్తూ పెళ్లి చేసేసుకున్న శర్వానంద్ పై ప్రభాస్ ఫన్నీగా ఫైర్ అయినట్టు తెలుస్తుంది . ఈ క్రమంలోనే శర్వానంద్ ను ఫన్నీగా టార్గెట్ చేస్తూ ఆయనపై పంచెస్ వేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు ప్రభాస్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది ..!!