తెలుగు సినిమా ప్రపంచంలో మహానటి సావిత్రి స్థానం చాలా డిఫరెంట్. ఆవిడ ప్లేస్నుఎవరూ రిప్లేస్ చే యలేదు. అలాంటి నటికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొందరుసినీ ప్రపంచంలోనే ఉం డడం విశేషం. అలాంటివారిలో దాసరి నారాయణ రావు ఒకరు. ఆయనకు సావిత్రి అంటే.. పంచ ప్రాణాలు అన్నట్టుగా ఉండేది. ఆమెకు కూడా దాసరి అంటే.. అభిమానం. అంతేకాదు.. సొంత కుటుంబ సభ్యుడిగా ఆయనను ట్రీట్చేసేవారు.
ఈ క్రమంలోనే దాసరిని సావిత్రి.. తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఇలా.. సావిత్రితో దాసరికి ఫ్యామిలీ రిలేషన్ బలపడింది. దాసరి కూడా సావిత్రిని అక్కా అని ఆప్యాయంగా పిలిచేవారు. అసలు తాను సినిమాల్లోకి రావడానికి సావిత్రి అక్కే స్ఫూర్తి అని దాసరి ఎన్నోసార్లు చెప్పారు. దీంతో తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను తీరిక దొరికినప్పుడల్లా దాసరికి ఆమె చెప్పేవారు.
వాటిల్లో ఒక సంఘటన దాసరిని కదిలించింది. అదే శివరంజని సినిమా తీయడానికి ఆయన్ని ప్రేరేపించింది. ఇలా అనుకోవడమే ఆలస్యం.. అలా దాసరి సినిమా తీయాలని నిర్ణయించారు. అయితే.. నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయంలో తనే నిర్మాతగా మారిన దాసరి నారాయణరావు శివరంజని చిత్రాన్ని నిర్మించారు.
అంతేకాదు.. ఆ సినిమాను ఒక ప్రయోగాత్మకంగా కూడా తీయడం గమనార్హం. ఈ సినిమాలో అప్పుడే తెరమీదకి వస్తున్న వర్ధమాన తారలు.. జయసుధ, సుభాషిణి, మోహన్ బాబు, హరిప్రసాద్ వంటి వారితో సినిమా స్కోప్లో తీసి రికార్డ్ క్రియేట్ చేశారు దాసరి. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. బెంగళూరులో ఈ చిత్రం 52 వారాలు ఆడడం విశేషం.
ఈ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన వేడుకకు ఎన్టీఆర్, ఏయన్నార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి.. సావిత్రి జీవితంలోని కొన్ని విశేషాలతోనే ఈ సినిమా తీసినట్టుచెప్పారు. దీనిని ఆమెకే అంకితం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇదీ.. సంగతి..!