Gossipsదిల్ రాజును భ‌య‌పెట్టిన సినిమా ఇదే..

దిల్ రాజును భ‌య‌పెట్టిన సినిమా ఇదే..

తెలుగులో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఇరవయ్యేళ్లుగా కొనసాగుతోన్న దిల్‌ రాజు నిర్మాతగా బిజీ అయినప్పటికీ పంపిణీ రంగానికి దూరం కాలేదు. ఇప్పటికీ నైజాంలో ఏ పెద్ద సినిమా అయినా దిల్‌ రాజుని దాటాకే వేరే పంపిణీదారులకి వెళ్లాలి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద చిత్రాలకి రేట్లు భారీ మొత్తంలో పెంచేశారు. క్రేజ్ ఉన్న సినిమాలు అయితే ఒక మాదిరి డిస్ట్రిబ్యూట‌ర్‌కు అంద‌ని ద్రాక్షగానే కనిపిస్తోంది. అంతగా భారీ రేట్లు చెప్పి మరీ బయపెట్టేస్తున్నారు.

పెద్ద సినిమాల హక్కులు కావాలంటే ఖచ్చితంగా నిర్మాతలు చేప్పినంతా చెల్లించాల్సి రావడంతో దిల్‌ రాజు ఇష్టం లేకపోయినా కొన్ని పెద్ద సినిమాలపై భారీ రేటు పెట్టి మరి కొన్నాడు . స్పైడర్‌ చిత్రానికి దిల్‌ రాజు రూ. 22 కోట్లు అచ్చంగా ఇచ్చాడు. కానీ దీనికి తిరిగి పది కోట్ల షేర్‌ కూడా రాలేదు. అదేవిధంగా జై లవకుశ చిత్రాన్ని పద్ధెనిమిది కోట్లకి కొంటే రెండు నుంచి మూడు కోట్ల వరకు నష్టం వచ్చింది. ఫిదా చిత్రంపై భారీ లాభాలు గడించిన దిల్‌ రాజుకి ఆ లాభం మొత్తం ఈ రెండు సినిమాలతో పోవడంతో ఆయన ఆనందం అంతా ఆవిరి అయిపొయింది.

ముఖ్యంగా స్పైడర్‌ మిగిల్చిన నష్టంతో దిల్‌ రాజు బాగా డిజప్పాయింట్‌ అయ్యాడట. పంపిణీ వ్యవస్థ మరీ గ్యాంబ్లింగ్‌ మాదిరిగా తయారైందని, ఇకపై పెద్ద చిత్రాల పంపిణీకి దూరంగా వుంటానని సన్నిహితులతో అంటున్నాడట. ఇప్పటికే దిల్‌ రాజు, ఏషియన్‌ సినిమాస్‌ తప్ప నైజాంలో పెద్ద పంపిణీదారులు ఎవరూ లేరు. ఆ మ‌ధ్య కొద్ది రోజుల పాటు పెద్ద సినిమాలు కొంటూ నైజాంలో హ‌డావిడి చేసిన అభిషేక్ పిక్చ‌ర్చ్ సంస్థ ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యింది. ఏదేమైనా స్పైడ‌ర్ పేరు చెపితేనే దిల్ రాజు భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట‌.తెలుగులో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఇరవయ్యేళ్లుగా కొనసాగుతోన్న దిల్‌ రాజు నిర్మాతగా బిజీ అయినప్పటికీ పంపిణీ రంగానికి దూరం కాలేదు. ఇప్పటికీ నైజాంలో ఏ పెద్ద సినిమా అయినా దిల్‌ రాజుని దాటాకే వేరే పంపిణీదారులకి వెళ్లాలి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద చిత్రాలకి రేట్లు భారీ మొత్తంలో పెంచేశారు. క్రేజ్ ఉన్న సినిమాలు అయితే ఒక మాదిరి డిస్ట్రిబ్యూట‌ర్‌కు అంద‌ని ద్రాక్షగానే కనిపిస్తోంది. అంతగా భారీ రేట్లు చెప్పి మరీ బయపెట్టేస్తున్నారు.

పెద్ద సినిమాల హక్కులు కావాలంటే ఖచ్చితంగా నిర్మాతలు చేప్పినంతా చెల్లించాల్సి రావడంతో దిల్‌ రాజు ఇష్టం లేకపోయినా కొన్ని పెద్ద సినిమాలపై భారీ రేటు పెట్టి మరి కొన్నాడు . స్పైడర్‌ చిత్రానికి దిల్‌ రాజు రూ. 22 కోట్లు అచ్చంగా ఇచ్చాడు. కానీ దీనికి తిరిగి పది కోట్ల షేర్‌ కూడా రాలేదు. ఫిదా చిత్రంపై భారీ లాభాలు గడించిన దిల్‌ రాజుకి ఆ లాభం మొత్తంస్పైడర్‌ చిత్రానికి పోవడంతో ఆయన ఆనందం అంతా ఆవిరి అయిపొయింది.

ముఖ్యంగా స్పైడర్‌ మిగిల్చిన నష్టంతో దిల్‌ రాజు బాగా డిజప్పాయింట్‌ అయ్యాడట. పంపిణీ వ్యవస్థ మరీ గ్యాంబ్లింగ్‌ మాదిరిగా తయారైందని, ఇకపై పెద్ద చిత్రాల పంపిణీకి దూరంగా వుంటానని సన్నిహితులతో అంటున్నాడట. ఇప్పటికే దిల్‌ రాజు, ఏషియన్‌ సినిమాస్‌ తప్ప నైజాంలో పెద్ద పంపిణీదారులు ఎవరూ లేరు. ఆ మ‌ధ్య కొద్ది రోజుల పాటు పెద్ద సినిమాలు కొంటూ నైజాంలో హ‌డావిడి చేసిన అభిషేక్ పిక్చ‌ర్చ్ సంస్థ ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యింది. ఏదేమైనా స్పైడ‌ర్ పేరు చెపితేనే దిల్ రాజు భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news