Moviesబిగ్ షాకింగ్: అక్కినేని పై బాలయ్య కామెంట్స్ కు సమంత కౌంటర్..వార్...

బిగ్ షాకింగ్: అక్కినేని పై బాలయ్య కామెంట్స్ కు సమంత కౌంటర్..వార్ పెంచేసిందిగా..!?

స్టార్ పొజిషన్ వచ్చాక మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని మాట్లాడాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం కామన్ గా మారిపోయింది . స్టార్ సెలబ్రిటీస్ విషయంలో కాపలాకాస్తు ఎప్పుడు టంగ్ స్లిప్ అవుతారు అంటూ ట్రోలర్స్ కాచుకొని కూర్చుని ఉంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలయ్య టంగ్ స్లిప్ అవుతూ అక్కినేని తొక్కనేని అంటూ మాట తూలారు. దీనితో ఎప్పుడు దొరకని బాలయ్య ఒక్కసారిగా టంగ్ స్లిప్ అవడంతో సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేస్తున్నారు.

అంతేకాదు నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళు కూడా బాలయ్య పేరు చెబుతూ కౌంటర్ వేయడం స్టార్ట్ చేశారు . ఈ క్రమంలోని అక్కినేని నాగచైతన్య సైతం బాలయ్యకు పరోక్షంగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ – ఎస్వీఆర్ కళామతల్లి బిడ్డలని అలాంటి వాళ్ళని తక్కువ చేస్తే మనల్ని మనం కించపరచుకోవడమే అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్స్ అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గా అక్కినెని మాజీ కోడలు సమంత ఓపెన్ అప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . “ఎవరైనా సరే ఖచ్చితంగా లైఫ్లో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ..వాటిని మనం క్షమించి వదిలేయాలి.. అంతేకానీ ఇలా చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయకూడదు ..బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో పొరపాటున అలా మాట్లాడి ఉంటారు ..ఆయన వయసుకి ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న పెద్దరికానికి మనం రెస్పెక్ట్ ఇచ్చి లైట్ తీసుకోవాలి .. అంతేకానీ ఇలా చిన్న ఇష్యూని పెద్దగా చేసి రాద్ధాంతం చేయకూడదు ” అంటూ పరోక్షకంగా నాగచైతన్య చేసిన ట్విట్ పై కౌంటర్ వేసింది సమంత అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే అక్కినేని – నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ కి చేరింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news