Gossipsవెంకీకి షాక్ ఇచ్చిన ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు..

వెంకీకి షాక్ ఇచ్చిన ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు..

వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే మూవీ కోసం ప్రస్తుతం హీరోయిన్స్ ని వెతుకుతున్నారు మూవీ యూనిట్. ఈ మూవీ కోసం తమన్నా లేకపోతే కాజల్ లను పరిశీలిస్తున్నారని వార్తలు కూడా బయటకి వచ్చాయి. అయితే వారిద్దరూ వెంకటేష్ తో నటించేందుకు నో చెప్పినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన దగ్గర మొన్నటి వరకు స్థిరంగా ఉన్న హీరోయిన్స్ కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా తమిళ్ – మలయాళ ప్రాజెక్టులను ఒకే చేస్తుండడంతో కొన్ని కథలకు కరెక్ట్ గా సెట్ అయ్యే హీరోయిన్స్ మిస్ అవుతున్నారని అనిపిస్తోంది. దర్శకుడు కథ రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ విషయంలో కరెక్ట్ స్టెప్ వేస్తేనే సక్సెస్ అందుకుంటాడు.

అయితే ఇటీవల తేజ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో తాను అనుకున్న కథకు కరెక్ట్ గా నటీనటులను సెట్ చేసుకొని హిట్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. కానీ పాత్రల ఎంపిక విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా, కాజల్ కూడా ఈ సినిమాలో నటించేందుకు పరోక్షంగా ఇష్టపడకపోవడంతో ఆలోచనలో పడ్డాడు తేజ.

పోనీ ఈ ఇద్దరు హీరోయిన్ లు బిజీగా ఏమీ లేరు. కాని కాజల్ మాత్రం.. కాస్త రెమ్యేనరేషన్ భారీగా అడిగేసి.. అలాగే తమన్నా అయితే డేట్స్ లేవు అంటే బిల్డప్ ఇచ్చేసి సినిమా వదులుకున్నారట. అయితే వెంకటేష్ పక్కన హీరోయిన్ అంటే.. ఇక యంగ్ హీరోలు పట్టించుకోరేమో అని అనుకుని ఈ ఛాన్సు వదులుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ సెట్ అయ్యే హీరోయిన్ ని ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకోవాలని తేజ చాలా ఆలోచిస్తున్నాడట. ఆ ఇద్దరు హీరోయిన్స్ నో చెప్పడంతో అనుష్క పేరు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news