నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద వెండితెరతో పాటు బుల్లితెర మీద కూడా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వెండితెరపై అఖండ నుంచి బాలయ్య అఖండ గర్జనే మోగిస్తున్నారు. ఇటు బుల్లితెరపై ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో గర్జన చేస్తున్నాడు. కెరీర్లోనే భయంకరమైన ఫామ్‌లో ఉన్న బాలయ్య ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా ఇప్పటికే రు. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసింది. ఓవర్సీస్లోనూ ఫస్ట్ డేకే మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ క్రాస్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో బాలయ్య ముందు నుంచి కాస్త డల్. ఆ మాటకు వస్తే నైజాంలోనూ బాలయ్యకు పెద్ద మార్కెట్ ఉండేదే కాదు. కానీ అఖండ నుంచి అన్ని ఏరియాల్లోనూ బాలయ్య మార్కెట్ రైజ్ అయిపోయింది. అసలు బాలయ్య మార్కెట్‌కు ఇప్పుడు కళ్లెం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి ఓవర్సీస్లో బాలయ్య కెరీర్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి అమెరికాలో 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది కెరీర్ పరంగా ఓవర్సీస్లో బాలయ్యకు సరికొత్త రికార్డే. ఇంతకు ముందు బాలయ్య నటించిన అఖండ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు 928 కే డాలర్ల వసూళ్లు రాబట్టింది.
అప్పటి వరకు బాలయ్యకు అదే ఓవర్సీస్ హయ్యస్ట్ గ్రాస్. దానిని అఖండ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు వీరసింహారెడ్డి 1.4 మిలియన్ డాలర్ల మార్క్‌తో అఖండ రికార్డును కూడా బ్రేక్ చేసి ఓవర్సీస్లో బాలయ్య కెరీర్లో ఆల్ టైం రికార్డుగా నిలిచిపోయింది. విచిత్రం ఏంటంటే లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు కూడా అక్కడ హాఫ్ మిలియన్ డాలర్లకే పరిమితం అయ్యాయి. కానీ వీరసింహారెడ్డి ఈ రేంజ్ వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా ఉంది.