టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కించిన వారసుడు సినిమా రిలీజ్ అయ్యింది. వంశీ .. దిల్‌రాజుకు మధ్య ఏదో బీరకాయలో పీచు బంధుత్వం ఉంది. అలా ఆ కాంపౌండ్‌లోనే సినిమాలు చేసుకుంటూ నెట్టుకొచ్చేస్తున్నాడు. అదంతా పక్కన పెడితే వారసుడు సినిమా ఓ టీవీ సీరియల్లా ఉందన్న సెటైర్లు భయంకరంగా వస్తున్నాయి. ఈ విమర్శలపై వంశీలో ఉక్రోషం ఒక్కసారిగా తన్నుకు వచ్చినట్టుగా ఉంది.
అసలు ట్రైలర్ చూస్తేనే తెలుగులో నాలుగు ఐదు సినిమాల సీన్లను లేపేశాడని ముందే అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూసినా అదే కరెక్ట్ అనిపించింది. ఈ సినిమా తమిళనాడు వాళ్లకు కాస్త కొత్తగా ఉందేమో గాని.. ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎన్నో చూసేశారు. ఈ క్రమంలోనే ఓ తమిళ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ తన సినిమాను సీరియల్‌తో పోల్చడం పట్ల ఫైర్ అయ్యాడు.
తాము ఓ సినిమా కోసం ఎంతో కష్టపడతామని.. తమ సినిమాను సీరియల్‌లా విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. ఓ సినిమా తీస్తే విమర్శించడం అస్సలు కరెక్ట్ కాదని వంశీ అనడంపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. సినిమా కోసం వంశీ ఒక్కడే కష్టపడడు అని.. అందులో వేలాది మంది కష్టం ఉంటుందని.. తాము కష్టపడి తీశాం… ఏది తీస్తే అదే చూడాలనడం కరెక్ట్ కాదంటూ వంశీని ఆడుకుంటున్నారు.
కొందరు నెటిజన్లు అయితే తాను హోటల్‌కు వెళ్లి ఇడ్నీ ఆర్డర్ ఇచ్చాను. పాచిపోయిన చట్నీ ఇస్తే తాను అతడిని క్వశ్చన్ చేయనా ? ఇది అంతే మేం వందల రూపాయలు పెట్టుకుని థియేటర్‌కు వస్తే క్వాలిటీ ప్రొడక్ట్ అందించాల్సిన బాధ్యత మీదే కదా ? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా చూస్తే ట్రోలర్స్‌కు వంశీ క్లాస్ పీకడం కాదు… వంశీ తీసిన సినిమాలు చూస్తే సినీ జనాలే మనోడి పరమ రోటీన్ రాడ్ రంబోలా అని సెటైర్లు వేసుకుంటూ ఉంటారట.
మున్నా పెద్ద రాడ్… బృందావనం కథ వంశీది కాదు.. అంత మంచి కథను కూడా కొన్ని చోట్ల రొటీన్గా లాగేశాడు. ఇక ఎవడు సినిమా ఎంత రాడ్డో చెప్పక్కర్లేదు. ఏదో మహేష్ వన్ సినిమా ప్లాప్ అవ్వబట్టి ఎవడు ఆడేసింది. ఊపిరి మరింత కొత్తగా ట్రై చేయొచ్చు… ఇక మహర్షి సినిమా కథ, టేకింగ్ కన్నా మహేష్ ఇమేజ్ మీద ఆడేసింది. ఎంత కొత్త ఇచ్చినా చాలా పాతగా తీయడమే వంశీ స్టైల్. ఆ విషయం ఇండస్ట్రీ జనాలకు.. తెలుగు సినిమా అభిమానులకు తెలుసు.
మరి అలాంటప్పుడు తానేదో మిగిలిన దర్శకుల కంటే ఏదేదో కొత్తగా తీసేశానని.. తానే తీసిందే పరమాన్నం.. చెప్పిందే వేదం అన్నట్టుగా వంశీ మాటలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారసుడు తమిళ జనాలకే పెద్దగా నచ్చలేదు. విజయ్ ఫ్యాన్‌బేస్‌తో పాటు అటు అజిత్ తునివు ప్లాప్ అవ్వడంతో గతిలేక చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి వంశీ కౌంటర్లకు దిగడం సరికాదేమో ?