2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి గ్రాండ్‌గా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా రీమేక్ అయినా కూడా చిరు ఛరిష్మాతో గట్టెక్కేసింది. ఆ తర్వాత సైరా అంచనాలు తల్లకిందులు చేసింది. ఇక గత యేడాది అయితే రెండు గట్టి షాక్‌లు తగిలాయి. ఆచార్య అట్టర్ ప్లాప్.. తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఫస్ట్ టైం చేసిన సినిమా ప్లాప్ అవ్వడం మెగాభిమానులకు ఎప్పటకీ పీడకలే.
ఇక దసరాకు వచ్చిన గాడ్ ఫాధర్‌కు హిట్ టాక్ వచ్చినా అప్పటికే మళయాళంలో వచ్చేసిన లూసీఫర్‌కు రీమేక్ కావడంతో జనాలు పట్టించుకోలేదు. ఆ సినిమా కూడా ఓవరాల్‌గా రు. 55 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయ్యింది. ఇక మూడు నెలల గ్యాప్‌లో ఈ సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకు ముందు అనుకున్నంత హైప్ లేకపోయినా.. సంక్రాంతికి పోటీగా వచ్చిన సినిమాలకు కూడా యావరేజ్ టాక్ రావడం…. ఈ సినిమాలో కామెడీతో పాటు రవితేజ ఉండడంతో వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.
ఇప్పటికే రు. 130 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసిన ఈ సినిమా.. అటు ఓవర్సీస్‌లో కూడా 2 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోకు బ్లాక్ బస్టర్ రావడంతో మెగాభిమానుల ఆనందం మామూలుగా లేదు. అయితే ఈ ఆనందాన్ని చిరు అప్పుడే ఆవిరి చేసేసే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా రీమేకులే చేస్తున్నాడు. అవి ఫ్యాన్స్‌కు గునపాల్లా గుచ్చుకుంటున్నాయి.
ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాథర్, రేపు వస్తోన్న భోళాశంకర్ తో పాటు ఆ వెంటనే అజిత్ నటించి తెలుగులో కూడా వచ్చేసిన విశ్వాసం సినిమా రీమేక్‌లో నటించబోతున్నాడట. ఇందుకు చిరు ఓకే చెప్పేశాడని.. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. అసలు విశ్వాసం పరమ కుక్కరాడ్ సినిమా.. అజిత్ నటించిన ఆ సినిమా తెలుగులో రిలీజ్ చేసినా ఎవ్వరూ చూడలేదు.
నయనతార హీరోయిన్గా నటించింది. కూతురు సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమాకు మాస్ మసాలా దినుసులు అద్దేసి తెలుగులో చిరు రీమేక్ చేస్తే గాడ్ ఫాథర్‌లాగానే ఉంటుందేమో ? అన్న సందేహాలు వస్తున్నాయి. మరి చిరు ఏం చేస్తాడో ? చూడాలి.