Gossipsఎక్స్క్లూజివ్: బాలయ్య ప్రొడక్షన్ హౌస్ డీటైల్స్

ఎక్స్క్లూజివ్: బాలయ్య ప్రొడక్షన్ హౌస్ డీటైల్స్

నందమూరి నటసింహం బాలయ్య యమా స్పీడుగా ఉన్నాడండోయ్ ! ఆయన వరుస పెట్టి సినిమాలు చేసేస్తుండడంతోపాటు సొంతంగా ఒక సినీ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసేసుకున్నాడు.  బాలయ్య స్పీడ్ చూస్తుంటే ఆయన సొంత బ్యానర్ నుంచి జెట్ స్పీడ్‌తో సినిమాల నిర్మాణాలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నట్టు బాలయ్య సినిమా నిర్మాణ సంస్థ గురించి చెప్పనేలేదు కదూ .. దాని పేరు బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్. ఇప్పుడు ఇండ్రస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరికీ దాదాపుగా సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు, అక్కినేని కుటుంబానికి  అన్న‌పూర్ణ స్టూడియో, వెంకటేష్ కి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉన్నాయి. నందమూరి కుటుంబానికి సొంత బ్యాన‌ర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందుకే బాలయ్య కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాడు.
బాలకృష్ణ 103వ చిత్రంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ను సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ ను బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ తో పాటు సాయి కొర్రపాటి.. విష్ణులు కలిసి నిర్మించనున్నారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఓ మాంచి ఆఫీస్ నిర్మాణం ప్రారంభించే పనిలో ఉన్నారు బాలయ్య. తన ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్లాట్స్ ను పరిశీలించిన బాలయ్య.. చివరకు ఓ రెండింటిని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ రెండింటిలో ఒకదాన్ని కొనుగోలు చేస్తారట బాలకృష్ణ. ఈ ఆఫీస్ నిర్మాణం శరవేగంగా పూర్తి కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం అయ్యే సమయానికి ఆపీసు కూడా రెడీ అయిపోవాలని బాలయ్య కూడా కంగారుగా ఉన్నాడు. అయితే ఇక ఈ టాప్ హీరో సొంత బ్యానర్ నుంచి మంచి కిక్కిచ్చే పవర్ ఫుల్ సినిమాలు వచేస్తాయన్నమాట . కమాన్ బాలయ్య ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news