జబర్దస్త్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి ..రాకింగ్ రాకేష్ – సుజాతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . న్యూస్ రిపోర్టర్‌గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సుజాత .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పేరుకు మరింత పాపులారిటీ దక్కించుకుంది. అలాగే ఎటువంటి సపోర్ట్ లేకుండా తనదైన స్టైల్ లో జబర్దస్త్ లో కామెడీ పంచెస్ వేస్తూ చిన్నపిల్లలతో స్కిట్స్ వేసి హెల్తీగా ఆకట్టుకునే రాకింగ్ రాకేష్ జనాలకు సుపరిచితుడే.
వీళ్ళిద్దరి కాంబో అసలు ఎలా సెట్ అయిందంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అన్న రూమర్ గట్టిగా వినిపిస్తుంది . దానికి తగ్గట్టే పెళ్లికి ముందే సుజాత – రాకింగ్ రాకేష్ వాళ్ళ ఇంట్లో ఉంది అంటూ కూడా పుకారు వైరల్ అవుతుంది. అంతేనా రాకింగ్ రాకేష్ – సుజాత జంట పెళ్లికి ముందే చట్టపట్టలేసుకొని ఏకంగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మీడియా ముందే కనిపించారు . పలు షోస్ కి అటెండ్ అవుతున్నారు . అయితే ఈ జంట పెళ్లెప్పుడు అంటే మాత్రం నోరు మెదపట్లేదు . రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ లోనూ అదే తంతూ కనిపించింది.
రేపు రాత్రి 9:30 కు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయింది . ప్రోమోలో అందరికన్నా హైలెట్‌గా నిలిచారు రాకింగ్ రాకేష్ సుజాత జంట. స్కిట్లో భాగంగా చేశారో లేక రియల్ గానే వాళ్ళ పెళ్లి గురించి అభిమానులకు చెప్పబోతున్నారో తెలియదు కానీ ప్రోమోలో మాత్రమే ఈ జంట బిహేవ్ చేసిన పద్ధతి టూ మచ్ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . రాకింగ్ రాకేష్ – సుజాత వేలికి రింగ్ పెడుతూ ఆమెను దగ్గరగా తీసుకుని హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టడం ప్రోమో కి హైలెట్‌గా మారింది.
ఇదంతా చూస్తుంటే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న మరి కొందరు అంత సీన్ లేదు ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ , టిఆర్పీలు ప్రమోలు కోసమే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రాకింగ్ రాకేష్ – సుజాత పెళ్లి చేసుకోబోతున్నారు అని ఆశపడిన వాళ్లకి అలాంటి కామెంట్స్ షాకింగ్ ట్వీస్ట్ ఇస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ జంట పెళ్లి డేట్ ప్రకటించి ఎన్ని ముద్దులు పెట్టుకున్న ..ఎన్ని హగ్గులు చేసుకున్నా ఎవరూ పట్టించుకోరు కదా ..అనేది జనాల అభిప్రాయం . చూద్దాం ఈ జంట ఏం చేస్తుందో..?