కమల్‌హాసన్ విక్రమ్ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నాయి. సినిమా అయితే యూనవర్సల్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అసలు కమల్‌ను జనాలు మర్చిపోయారనుకుంటోన్న టైంలో వచ్చిన విక్రమ్ ఆయన అభిమానులకే కాదు.. టోటల్ ఇండియన్ సినిమా జనాలకు కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
ఈ సినిమా వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా మన సినీ జనాలు దాని హ్యాంగోవర్ నుంచి బయట పడడం లేదంటున్నారు. మన దగ్గర సీనియర్ హీరోలు చాలా మంది ఉన్నారు. దీంతో విక్రమ్ లాంటి సినిమా చేస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టే మన దర్శకులు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనల్లో ఉంటున్నారు.
టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ టాక్ ప్రకారం బాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కథ విక్రమ్ స్టైల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హీరో క్యారెక్టర్ ఓల్డ్ మ్యాన్ కాదు కానీ.. మిడిల్ ఏజ్ అంటే 50 ఏళ్లకు కాస్త అటూ ఇటూగా ఉండేలా డిజైన్ చేశాడట దర్శకుడు. మిడిల్ ఏజ్జ్ యాంగ్రీ ఫైటర్‌గా హీరో క్యారెక్టర్ ఉంటుంది. అంటే విక్రమ్ సినిమాలో కమల్ పాత్రలా అని అర్థం చేసుకోవాలి.
బాలయ్య ఇప్పటికే రొటీన్‌గా మాస్ మసాలా యాక్షన్ పాత్రలే ఎక్కువుగా చేస్తున్నాడన్న చర్చ ఉంది. అయితే అఖండలో అఘోరా పాత్ర చేసి.. అసలు ఈ పాత్రను ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవ్వరూ చేయలేరన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. వీరసింహారెడ్డి మళ్లీ రొటీన్. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య పాత్ర కొత్తగా ఉంటే.. మరో సరికొత్త బాలయ్యను మనం చూడబోతున్నట్టే..!