తెలుగు వారి సోగ్గాడు శోభన్‌బాబు గురించి, ఆయన క్రమశిక్షణ గురించి ఒకప్పుడు కథలు కథలుగా చెప్పుకొనే వారు. అనేక చిత్రాల్లో ఆయన నటించారు. ఇటు పౌరాణికం నుంచి అటు సాంఘికం వరకు అనేక సినిమాల్లో రికార్డులు సాధించారు. అంతేకాదు.. జయలలిత వంటి వారితో పెద్దగా నటించకపోయినా.. అనేక ర్యూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. శోభన్‌బాబుతో జతకట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడేవారు.
అయితే.. ముఖ్యంగా వాణిశ్రీ-శోభన్‌బాబు, శారద-శోభన్‌బాబు కలిసి నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎక్కువగా ఆదరణ ఉండేది. దీనికి కారణం.. వారి కాంబినేషన్‌తో పాటు.. పలు సీన్లలో జీవించడమేనని అప్పట్లో టాక్ ఉండేది. మానవుడు దానవుడు సినిమాలో శారదతో కలిసి నటించిన శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయిందనేటాక్ వినిపించింది.
అయితే.. ఈ పేరువ చ్చిన తర్వాత ఒక సందర్భంలో వీరు కలిసి ఉన్న ఫొటోను అప్పటి వారపత్రికలో ప్రచురించి.. ఏదో ఉందని రాసుకొచ్చారు. అయితే.. అప్పటికి శారదకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదేసమయంలో ఈ వార్త రావడంతో సినీమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ సాగింది. ఇక, బయట అయితే.. కథకథలుగా చెప్పుకొనేవారట. దీంతో శోభన్‌బాబు అలెర్ట్ అయ్యారు.
ఆ తర్వాత.. దాదాపు ఐదారేళ్ల వరకు కూడా శారదతో ఆయన కలిసి నటించలేదని అంటారు. ఎందుకంటే.. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని, తను కూడా ఇబ్బంది ఎదుర్కొనకూడదని.. ఆయన భావన. అందుకే.. ఆయన పాటించే క్రమశిక్షణలో ర్యూమర్లకు కూడా కడుదూరంలో ఉండేవారట. ఏదైనా.. ర్యూమర్ వచ్చినా.. మాటల ద్వారా.. ఏమీ అనేవారు కాదట. తన చేతల ద్వారానే నిరూపించేవారట శోభన్ బాబు.