కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్లు, లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులపై సీన్‌ను బట్టి.. రేప్ సీన్లు ఉంటాయి. ముఖ్యం గా కుటుంబ కథా సినిమాల్లో ఈ తరహా సీన్లు ఎక్కువగా కనిపించేవి. ఒకదశకంలో అయితే.. కుటుంబ కథా చిత్రాల్లో ఈ సీన్లు ఎక్కువగా కనిపించాయి. మహానటి సావిత్ర నుంచి అంజలీదేవి వరకు ఈ సీన్లు చేసినవారే. అయితే.. వీటిలో నటించేందుకు ఎక్కువ మంది హీరోయిన్లు ఇష్టపడే వారు. ముఖ్యంగా భానుమతి అయితే.. “రేప్ సీనా.. వేరే వారిని పెట్టుకోండి“ అని మొహం మీదే చెప్పేవారట.
ఇతర నటీమణులు మాత్రం సీన్ డిమాండ్ చేసినప్పుడు ఏం చేస్తాం.. అని సర్దుకు పోయేవారు. అయితే.. ఆయా సీన్లలో తగు జాగ్రత్తలు తీసుకునేవారు. మరికొందరు నటీమణులు.. డూప్‌లు పెట్టమని బలవం తం చేసేవారు. దీంతో విధిలేని పరిస్థితిలో క్లోజ్షాట్లు చేసినప్పుడు వారి మొహాలు చూపించిన దర్శకు లు… ఇతర సీన్లు చేయాల్సి వస్తే.. డూప్‌లను ఫాలో అయ్యేవారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. అందరూ ఒకేలా ఉండరన్నట్టుగా.. ఒక నటి మాత్రం రేప్ సీన్ అయినా.. ఇబ్బంది లేదు.. మీ ఇష్టం అనేవారట. దీంతో దర్శకులు, నిర్మాతలు.. ఆయా సీన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేవార ట. ఆమే.. దేవతా పాత్రల్లో అందరినీ అలరించిన నటి.. కేఆర్ విజయ. తను హీరోయిన్గా నటించినా.. కేరక్టర్ ఆర్టిస్టుగా నటించినా కేఆర్ విజయ రేప్ అంటే.. ఎక్కడా జంకేది కాదని అంటారు.
ఇటీవల మృతి చెందిన కైకాల సత్యనారయణ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.
“సూత్ర ధారులు సినిమాలో ఒక రేప్ సీన్ ఉంది. అప్పటికి కేఆర్ విజయ వరకు 45 ఏళ్లు పైబడే ఉంటాయి. అయినప్పటికీ.. రేప్ సీన్ అనగానే ఎలాంటి జంకు లేకుండా.. స్వేచ్ఛగా చేసుకోవచ్చని చెప్పారు…“ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదీ.. సంగతి..!