Moviesప్రభాస్ అనుష్క ను పెళ్ళి చేసుకుంటే బెటర్ నా..? కృతి సనన్...

ప్రభాస్ అనుష్క ను పెళ్ళి చేసుకుంటే బెటర్ నా..? కృతి సనన్ ని చేసుకుంటే బెటర్ నా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు . కాగా ప్రభాస్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే మేటర్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే. ఈ మధ్యనే అన్ స్టాపబుల్ షో కి వచ్చిన ప్రభాస్ ..తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తారని ..అంతా అనుకున్నారు .

అయితే ఎక్కడ పాజిటివ్ కామెంట్స్ చేయకుండా స్కిప్ చేయడంతో ..అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోల్ వైరల్ అవుతుంది. ప్రభాస్ హైట్ కి వెయిట్ కి ఆయన కటౌట్ కి రేంజ్ కి ..స్టార్ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకుంటే బెటర్ నా..? లేక బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ని పెళ్లి చేసుకుంటే బెటర్ నా..? అంటూ పోల్ క్రియేట్ చేసారు రెబల్ ఫ్యాన్స్.

ఈ క్రమంలోని ఎక్కువమంది అనుష్క – ప్రభాస్ జంటకే ఓటు వేయడం ..ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది . అంతే కాదు ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానులు కోరిక .. అలాగే సినీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది కోరుకుంటున్నారు . చూడాలి మరి ప్రభాస్ తన పెళ్లి గురించి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news