తెలుగు సీనిరంగంలో తమకంటూ… ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఒకప్పటి సావిత్రి, అంజలీదేవి, భానుమతి మాదిరిగానే తర్వాత.. తరంలో జయప్రద, జయసుధ, శ్రీదేవిలు తమ నటనతో రెచ్చిపోయి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా జయప్రద-జయసుధ కలిసి నటించిన సినిమాలకు క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. వీరిద్దరు 20 ఏళ్లకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేశారు.
అప్పట్లో వీరికి పోటీగా శ్రీదేవి ఉన్నా కూడా జయసుధ, జయప్రద మాత్రం తమ పట్టు నిలుపుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించిన సూపర్ హిట్లు కొట్టారు. అంతేకాదు.. మొదట్లో వీరిని కలిసి నటించేలా ప్రోత్సహించినప్పుడు.. చాలా మందినిర్మాతలు వెనుకాడారు. ఎందుకంటే.. ఎవరికి వారికి ఒక గుర్తింపు ఉంది.
ఇలాంటి సమయంలో ఇద్దరూకలిసి నటిస్తే.. ఆ సినిమకు మహిళా ఆదరణ ఎలా ఉంటుందో.. ఎవరి పెర్మార్మెన్స్‌లో అయినా..చిన్న తేడా వస్తే.. సినిమా హిట్ అవుతుందో లేదో.. అనే సందేహం ఉండేది. అయినప్పటికీ.. దర్శకులు చాలా మంది వీరిని ప్రోత్సహించారు. ఈ క్రమంలో జయప్రద-జయసుధ కలిసి నటించిన సినిమాలు తర్వాత కాలంలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కురుక్షేత్రం, మేఘసందేశం, అడవి రాముడు వంటి సినిమాలు.. సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.
తర్వాత.. వచ్చిన సినిమాలు కూడా ఇదే విజయాన్ని అందుకున్నాయి. అయితే.. ఈ కాంబినేషన్ ఎక్కువగా ముందుకు సాగలేదు. ఎందుకంటే.. రెమ్యునరేషన్ ప్రాబ్లం రావడంతో జయప్రద తప్పుకొన్నారు. జయసుధ కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని.. తనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలా ఆమె పెట్టిన డిమాండ్‌తో వీరిద్దరి కాంబినేషన్‌కు బ్రేకులు పడ్డాయి. మొత్తానికి వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు కొన్నే అయినా.. నిర్మాతలు మాత్రం పండగ చేసుకునేవారు.