నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఎట్టకేలకు ఊరిస్తూ ఊరిస్తూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు కంప్లీట్ అయిపోయాయి. ఇక అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యేడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాలయ్య ఈ సినిమా చేశారు. అటు రవితేజతో మలినేని గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు బాలయ్య లాంటి హీరోను డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయంకాదు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు చూస్తుంటే మలినేని బాలయ్య స్టైల్ ఫ్యాక్షనిజం, మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌నే తీసినట్టు తెలుస్తోంది. సాంగ్స్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చేసింది. అటు సంక్రాంతికే చిరు వాల్తేరు వీరయ్య, అజిత్ తెగింపు, విజయ్ వారసుడు సినిమాలు పోటీగా ఉన్నా కూడా వీరసింహాకే ప్రి రిలీజ్ బజ్ ఎక్కువుగా ఉంది.
ఇక వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు చూసుకుంటే ఈ సినిమాకు బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా ఇది ఎక్స్‌లెంట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక ఏపీ, తెలంగాణ వరకు చూస్తే ఈ సినిమాకు రు 61.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా అయితే రు. 73 కోట్ల బిజినెస్ జరిగింది. బాలయ్య అఖండకు వరల్డ్ వైడ్‌గా రు. 60 కోట్ల రేషియోలో బిజినెస్ జరిగితే.. ఇప్పుడు ఆ సినిమా కంటే వీరసింహాకు అదనంగా రు. 13 కోట్ల బిజినెస్ జరిగింది.
బాక్సాఫీస్ దగ్గర వీరసింహా క్లీన్ హిట్గా నిలవాలంటే రు. 74 కోట్ల షేర్ రాబట్టాలి. బాలయ్యకు ఇప్పుడు ఉన్న క్రేజ్‌కు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ షేర్ రావడం పెద్ద కష్టం కాదు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకు ఏరియాల వారీగా జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 15 కోట్లు
సీడెడ్ – 13 కోట్లు
ఉత్తరాంధ్ర – 9 కోట్లు
ఈస్ట్ – 5.2 కోట్లు
వెస్ట్ – 5 కోట్లు
గుంటూరు – 6.40 కోట్లు
కృష్ణా – 5 కోట్లు
నెల్లూరు – 2.7 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ = 61.30 కోట్లు
—————————————
కర్నాటక – 4.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1 కోటి
ఓవర్సీస్ – 6.2 కోట్లు
—————————
వరల్డ్ వైడ్ – 73 కోట్లు
—————————