ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పెళ్లి సందడ్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు ఈ సినిమాలో తన అంద చందాలతో కుర్రాలను తన వైపు తిప్పుకునింది. ఒక్క సినిమాతోనే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీలీల రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మెప్పించి అలరించింది .
ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది శ్రీలీల. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమె పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. కాగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది . చాలా సరదాగా క్యూట్‌గా అలరించే శ్రీ లీల కోపం వస్తే మాత్రం అపరిచితుడుల తయారైపోతుందట . అంతేకాదు అప్పటివరకు ఎలాంటి మూడ్‌లో ఉన్న తనని విసిగించే మాటలు మాట్లాడిన తనకి కోపం తెప్పించిన ఒక్కసారిగా ఫైర్ అయిపోతానని చెప్పుకొచ్చింది.
నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తానని.. ఆ టైంలో అమ్మ ఉన్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తానని ..కోపం చల్లారని తర్వాత తిట్టేశాను అని బాధపడి ఏడుస్తానని చెప్పుకొచ్చింది . అంతేకాదు అమ్మ కాబట్టి నా కోపాన్ని భరిస్తుంది మిగతా వారు ఎవరైనా సరే దెబ్బకు పారిపోతారు అంటూ పచ్చిగా తన ఒరిజినల్ బిహేవియర్ ను బయట పెట్టేసింది . దీంతో యంగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.