సినిమా ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలయ్యకు ఎలాంటి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెస్పెక్ట్ ఉందో అందరికీ తెలిసిన విషయమే . టాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ మరికొన్ని రోజుల్లోనే వీర సింహారెడ్డి అనే పేరుతో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు . గోపీ చంద్ డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శృతిహాసన్. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం నాడు ఒంగోలులో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిపారు . కాగా ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదించిన నందమూరి ఫ్యాన్స్ .. అందరి అటెన్షన్ ఈవెంట్లో బాలయ్య వేసుకున్న డ్రెస్ పై ఆయన ధరించిన వాచ్ పై పడ్డాయి .
కాగా ఈ క్రమంలోనే బాలయ్య ధరించిన వాచ్ కి ఉన్న స్పెషాలిటీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 1847 పారీస్ లో ఈ వాచ్ ని రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ వాచ్ అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమట . అందుకే ఈ వాచ్ ను తాను స్పెషల్‌గా భావించిన సందర్భాలలో ధరిస్తూ ఉంటారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ఆయన కూతురు బ్రాహ్మిణీ బాలయ్యకు గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తుంది . వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ చేతికి పెట్టుకున్న కార్డియార్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!