బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చూసుకుంటే హీరోయిన్స్ ఒంటిపై బట్టల సైజ్ బాగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎంత కప్పుకుంటే అంత మర్యాద. ఇప్పుడు ఎంత విప్పితే అంత క్రేజ్. అంత చూపిస్తే అంత పాపులారిటీ..అన్ని అవకాశాలు. ఐటెంస్ భామలంటే అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి వారే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం భామలుగా మారిపోతున్నారు.
ఎక్స్‌ఫోజింగ్ చేసే హీరోయిన్స్‌ను అప్పట్లో వేళ్ళపైన లెక్కపొట్టొచ్చు. కానీ, ఇప్పుడు అదే వేళ్ళపైన ఎక్స్‌ఫోజింగ్ చేయని వారెవరో చూడొచ్చు. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో ఎక్స్పోజింగ్ చేయని వాళ్లు భూతద్దంలో పెట్టి వెతికినా కనపడరు. ఎవరో ఎందుకు కీర్తి సురేష్ ముందు నుంచి కాస్త ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.
అందుకే ఆమె కమర్షియల్ హీరోయిన్గా సక్సెస్ కాలేదు. అందుకే మహేష్ సర్కారువారి పాట సినిమాలో అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. ఇక సాయిపల్లవికి ఎంత టాలెంట్ ఉన్నా స్టార్ల సరసన ఛాన్సులు రాకపోవడానికి ఆమె ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండడమే కారణం. ఈ తరం హీరోయిన్స్ మొదటి సినిమా నుంచే అన్నిటికీ రెడీ అవుతున్నారు. హీరోతో లిప్ కిస్ చేయాలా..? రెడీ. బెడ్రూం లో రొమాంటిక్ సీన్స్‌లో నటించాలా..రెడీ.
బికినీ వేసుకోవాలా..? రెడీ. ఇలా దేనికైనా రెడీ అంటున్నారు నవతరం కథానాయికలు. ఎక్స్‌ఫోజింగ్ చేయకపోతే ఎక్కడ అవకాశాలు ఇవ్వరో అని చాలామంది హీరోయిన్స్ భయపడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే అన్నిటికీ తెగించి అడుగులు వేయాలి. ఇది చేయను అది చేయను అంటే బయలుదేరమంటారు. ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకనే ముందే రివర్స్‌లో ఆఫర్ ఇస్తున్నారు.
ఇలా అన్నిటికీ సై అన్న తర్వాత కూడా అవకాశాలు రావడం లేదంటే కెరీర్ ప్రారంభం నుంచి ఫ్లాపులు వచ్చి ఉండాలి. ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ పడితేనే ఆ హీరోయిన్ను మేకర్స్ పక్కన పెడుతున్నారు. లేదంటే మాకు అవకాశాలివ్వండి. మీకు ఏం కావాలో చూపిస్తామనే ధోరణిలో రెడీగా ఉంటున్నారు. సక్సెస్‌లు వచ్చి ఇలా ఓపెన్ ఆఫర్ ఇస్తే ఆ హీరోయిన్ను బాగానే మోస్తారు మన మేకర్స్.