ఎన్టీఆర్-సావిత్రి అంటేనే తెలుగు తెరపై అదొక కన్నుల పండువైన చూడముచ్చటి జంట. అనేక సినిమాల్లో ఇద్దరూ హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి జంట అనూహ్యంగా అన్నా చెల్లెళ్లుగా నటించి.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎన్టీఆర్.. సావిత్రి అంటే ప్రేక్షకులు బండ్లు కట్టుకుని పల్లెల నుంచి తరలి వచ్చి మరీ సినిమాలు వీక్షించేవారు.
వీరిని కేవలం ప్రేమికులుగా.. భార్య భర్తలుగానే ప్రేక్షకులు చూసేవారు. అభిమాన సంఘాలుకూడా ఉండేవి. ఎన్టీఆర్‌తో సమానంగా సావిత్రి కూడా అభిమాన సంఘాలను మెయింటెన్ చేసేవారు. ఒకరకంగా .. చెప్పా లంటే.. అభిమాన సంఘాల పేరుతో చాలా మంది సావిత్రిని మోసం చేశారని కూడా అప్పటి క్రిటిక్స్ చెబు తారు. ఎవరైనా వచ్చి మీ పేరుతో అభిమాన సంఘం పెడుతున్నామంటే.. 50 వేల కు తక్కువ కాకుండా.. సావిత్రి చందా ఇచ్చేదట.
ఇలా.. అనేక మంది ఏమీ లేకుండానే మోసం చేశారని అంటారు. అయితే.. సావిత్రి మాత్రం వీటిని పట్టించు కునేవారు కాదట. పోనీలే.. మన పేరు చెప్పి. పదిమందికి సాయం చేస్తారు.. అని ఊరుకునేవారట. ఇక, ఎన్టీఆర్ విషయానికి వస్తే.. అభిమాన సంఘాలు ఉన్నప్పటికీ.. ఆయన పెద్దగా ప్రోత్సహించేవారు కాదట. ఒకవేళ..ఆయన ఏదైనా సాయం చేయాలని అనుకుంటే.. సోదరుడు త్రివిక్రమరావుతో విచారించి నిజానిజాలు తెలుసుకుని అప్పుడు డబ్బులు ఇచ్చేవారట.
ఇక, సావిత్రి ఎన్టీఆర్ సినిమా విడుదలైతే.. ఇరు అభిమాన సంఘాలుకూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసేవి. భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి మరీ.. దండలు వేసేవి.. అయితే.. ఖర్చుల విషయం సావిత్రి అభిమాన సంఘం చేతికి ఎముక లేకుండా ఖర్చు చేసేదట. అయితే ఆ ఖర్చులో చాలా వరకు సావిత్రి నుంచి వసూలు చేసిన సొమ్ములు కూడా ఉండేవట. అలా ఈ ఇద్దరి అభిమాన సంఘాల మధ్య అప్పట్లో పెద్ద పోటీ ఉండేదట. ఇదీ.. సావిత్రి, ఎన్టీఆర్ అభిమాన సంఘాల కథ.