Moviesవాట్..వాళ్ల భయంతోనే శృతి "వాల్తేరు వీరయ్య" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు...

వాట్..వాళ్ల భయంతోనే శృతి “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టిందా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ సినిమా హీరోయిన్ శృతిహాసన్ రావడం లేదు . దీంతో మెగా ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ మెంట్ లో ఉన్నారు . కాగా ఇన్నాళ్లు ఊరించి ఎట్టకేలకు మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతున్న ఈవెంట్లో కనిపిస్తుంది అనుకున్న శృతిహాసన్ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇవ్వడంతో చిత్ర బృందం ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లు తెలుస్తుంది .

మనకు తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని హీరోగా తెరకెక్కించిన సినిమా వాల్తేరు వీరయ్య . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శృతిహాసన్. బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . కాగా నేడు వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి . మరికొద్ది సేపట్లోనే మెగాస్టార్ చిరంజీవి వేదిక పైకి రానున్నారు .

కాగా లాస్ట్ మూమెంట్లో సినిమాలోని హీరోయిన్ అనారోగ్య కారణంగా ఈమెంట్ కి రాలేకపోతున్నానని హ్యాండ్ ఇచ్చింది . దీంతో శృతిహాసన్ బిహేవియర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా రెండు రోజుల క్రితమే ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ రేంజ్ లో డాన్స్ చేసిందో అందరికీ తెలిసిందే . ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి హ్యాండ్ ఇవ్వడం పట్ల మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . కాగా ఇన్స్టాల్ స్టోరీలో శృతిహాసన్ రాసుకోస్తూ ..”నా ఆరోగ్యం బాగోలేదు.. ఈ కారణంగా వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు రాలేకపోతున్నాను ..అందుకు చాలా బాధగా ఉంది . మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది . మా చిత్ర యూనిట్ మొత్తానికి విషెస్ చెప్తున్నాను . కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ” అంటూ పోస్ట్ పెట్టింది.

అయితే దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది . శృతిహాసన్ కి వాల్తేరు వీరయ్య సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసని ..ఈ కారణంగానే సినిమా ఈవెంట్ కు తప్పించుకునిందని ..ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమా ఫ్లాప్ అయితే ఆమె పరువు మరింతగా పోతుందని ..సోషల్ మీడియాలో ఆమెను హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తారని భావించిన కారణంగానే ఆమె లాస్ట్ మూమెంట్లో ఇలా హ్యాండ్ ఇచ్చింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news