సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ హీరోయిన్స్ ఉంటారు. కానీ డైరెక్టర్స్ మాత్రం ఒక కథను రాసుకునేటప్పుడు ఫలానా హీరోకి ఈ కథ బాగుంటుందని ..ఆ హీరోతో ఈ హీరోయిన్ రొమాన్స్ చేయాలని ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు . అయితే కాల్ షీట్స్ కారణంగా కావచ్చు కొన్ని అనివార్య కారణాల కారణంగా కావచ్చు సదరు హీరోతో ఆ హీరోయిన్ సినిమా చేయకుండా మిస్ చేసుకుంటుంది . అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. పరిస్థితులు అనుకూలించక ఇప్పటికీ ఆ స్టార్ హీరోలతో జతకట్టలేకపోతున్నారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది సమంత.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత ఎంతోమంది హీరోలతో ఆడి పాడి అలరించి నటించి మెప్పించింది . అయితే పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తో మాత్రం సమంత ఒక్క సినిమాలో కూడా జతకట్ట లేకపోయింది . దానికి రీజన్స్ వేరే ఉన్న ఓ సినిమాలో మాత్రం ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిన్నత్లే వచ్చి చేజారిపోయింది సంతకి. ఎస్ ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ గా నిలిచిన డార్లింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో కాజల్ – ప్రభాస్ రొమాన్స్ అభిమానుల్ని ఆకట్టుకుంది .
అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట . అయితే ప్రభాస్ ఆ హీరోయిన్ ని వద్దు అని రిజెక్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది . అంతేకాదు ఆ తర్వాత డైరెక్టర్ సమంత పేరును సజెస్ట్ చేయగా ప్రభాస్ ఆమె పేరుని ఏమాత్రం యాక్సెప్ట్ చేయకుండా కాకల్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది అంటూ చూస్ చేసుకున్నాడట . అంతేకాదు సమంత సైతం ప్రభాస్ తో నటించే అవకాశాలు వచ్చినా కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఏది ఏమైనా సరే డార్లింగ్ మూవీలో సమంతకంటే కాజల్ నే బాగా సెట్ అవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ప్రభాస్-సమంత కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?