దివంగత సూపర్‌స్టార్ కృష్ణ చనిపోయారు. ఆయన జీవించి ఉన్నప్పుడే ఆయన రెండో భార్య విజయనిర్మల కుమారుడు అనేక వివాదాల్లో ఉన్నారు. ముఖ్యంగా నరేష్ సినిమా జీవితంపై ఎలాంటి మచ్చలు లేకపోయినా ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఏదోలా వార్తల్లో అయితే ఉంటూ వస్తోంది. ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో నాలుగోపెళ్లికి సిద్ధమవుతోన్న వేళ నరేష్‌పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కృష్ణ చనిపోయిన రోజు రాత్రి అసలేం జరిగింది ? నరేష్, పవిత్ర ఎలా వ్యవహరించారన్నది రమ్య ఆధారాలతో సహా బయట పెట్టారు. ఆ రోజు రాత్రి కృష్ణ పార్తీవ దేహాన్ని ఆయన ఇంట్లోనే ఉంచారు. అంత గొప్ప వ్యక్తి చనిపోతే అసలు ఆ రాత్రి ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. అయితే మహేష్‌బాబుతో పాటు కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆ బాధలో ఉంటూ ఉదయం దహన సంస్కారాలు ఉండడంతో త్వరగానే నిద్రకు ఉపక్రమించేసినట్టు ఉన్నారు.
అయితే మీడియా వాళ్లు, సెలబ్రిటీలు ఉన్నప్పుడు నరేష్, పవిత్ర నానా హడావిడి చేసి.. వాళ్లు వెళ్లిపోయిన వెంటనే నరేష్, పవిత్ర కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారని .. తాను ఒక్కతినే రాత్రంతా ఆయన పార్తీవ దేహం దగ్గరే ఉన్నానని రమ్య చెప్పారు. అలాగే ఆమె మాత్రమే రాత్రి అక్కడ ఉన్న వీడియో కూడా ఆమె బయట పెట్టారు. ఈ వీడియోలో గంటగంటకు ఏం జరిగిందో ఆమె మొత్తం చూపించారు.
– 11 గంటలకు కేవలం రమ్య ఒక్కరు మాత్రమే అక్కడ ఉన్నారు.
– 12 గంటలకు మాత్రం ఒకరిద్దరు అక్కడ తిరుగుతూ కనిపించారు.
– 1 గంటకు రమ్య తన కుమారుడు కృష్ణ పార్తీవ దేహం పక్కనే ఉన్న ఫొటోకు అగరబత్తులు వెలిగిస్తుండగా అప్రిషియేట్ చేసిన సందర్భం కూడా వీడియోలో కనిపించింది. ఆ టైంలో కూడా అక్కడ ఎవ్వరూ లేరు. రమ్య తన కుమారుడితో మాత్రమే కలిసి ఉంది. అయితే కృష్ణకు వీరాభిమానులు అయిన ఇద్దరు డ్రైవర్లతో పాటు కృష్ణకు వీరాభిమాని అయిన ఓ మహిళా పోలీస్ అధికారిణి కూడా ఓపికగా కూర్చొని ఉన్నారు.
– ఇక 2 గంటలకు కూడా మరోసారి రమ్య తన కుమారుడితో కృష్ణ చిత్రపటం వద్ద అగరుబత్తి వెలిగిస్తోన్న సీన్ వీడియో తీశారు.
– 3 గంటలకు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. ఆ సమయంలో రమ్య స్నేహితురాళ్లు ఇందు, వేదిక కృష్ణను ఆఖరుసారి చూపేందుకు వచ్చారు.
– ఇక 4.15 గంటలకు రమ్య స్వయంగా కృష్ణ ఫోటో వద్ద దీపం వెలిగించారు.. అప్పటకి కూడా అక్కడ ఎవ్వరూ లేరు.
– ఉదయం 6.30 గంటలకు ఆయన పార్తీవదేహాన్ని పద్మాలయకు అంబులెన్స్‌లో షిఫ్ట్ చేశారని.. కనీసం షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆంబులెన్స్‌లోకి కూడా నరేష్ రాలేదని.. తాను దగ్గరే ఉండి పంపించానని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణ గారు నరేష్‌కు సొంత తండ్రి కాకపోయినా.. తనకు, నరేష్‌కు పీటల మీద కూర్చొని పెళ్లి చేశారని.. ఆయన ఓ గొప్ప వ్యక్తి అని.. ఆయన ప్రతి రోజు బయటకు వెళ్లేటప్పుడు అత్తగారు విజయనిర్మల గేటుబయట వరకు వచ్చి బై చెపుతారని.. ఆమె కోసం ఆయన అద్దం కూడా దించుతారని.. అలాంటి వ్యక్తికి చివర్లో దక్కాల్సిన సెండాప్ ఇది కాదని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు.