Moviesన‌రేష్ - ప‌విత్ర పెళ్లికి అదిరిపోయే టైటిల్ పెట్టిన న‌రేష్ మూడో...

న‌రేష్ – ప‌విత్ర పెళ్లికి అదిరిపోయే టైటిల్ పెట్టిన న‌రేష్ మూడో భార్య‌… !

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ప్రేమాయణం గత ఏడాదికాలంగా టాలీవుడ్లో పెద్ద ప్రకంపనలు రేపుతూ వచ్చింది. అటు ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్యా రఘుపతి తనకు విడాకుల వద్దంటూ నానా రచ్చ చేస్తుంది. మరోవైపు పవిత్ర లోకేష్ కు కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి వీరిద్దరూ కలిసి సహజీవనం చేయటం.. కృష్ణ చనిపోయినప్పుడు వీరిద్దరూ కలిసి అక్కడికి రావడంపై రకరకాల చర్చలు నడిచాయి.

అయితే ఏడాదిన్నర కాలంగా తమ ఇద్దరిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు నరేష్ – పవిత్ర. కొత్త ఏడాదిలో తామద్దం కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నామని.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఓ వీడియో రూపంలో ప్రకటన చేశారు. ఈ వీడియోలో నరేష్, పవిత్ర ఇద్దరు కలిసి లిప్ కిస్ ఇచ్చుకోవటం కూడా సంచలనంగా మారింది. అయితే నరేష్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నా.. ఆయన మూడో భార్య రమ్య మైసూర్ లో ఒక హోటల్ లో నరేష్, పవిత్ర ఉన్నప్పుడు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే నరేష్ అంగరక్షకుల‌ సాయంతో అక్కడ నుంచి బయటపడ్డాడు. ఇప్పటికే నరేష్ పై న్యాయపోరాటం చేస్తున్న‌ రమ్య తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వీరిద్దరి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ మల్లి పెళ్లి చేసుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ దానిని మళ్లీ పెళ్లి అనరని… మళ్ళీ మళ్ళీ మ‌ళ్లీ పెళ్లి అని పెట్టుకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు.
ఇక ఈ విషయంలో తాను మీడియా ముందుకు రాకపోవడానికి కూడా కారణాన్ని వెల్లడించారు.

దీనిపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నందున.. కోర్టుల్లో కేసులు నలుగుతున్నందున తాను బయటకు వచ్చి పెద్దగా మాట్లాడకూడదని తన తరపు వాదిస్తున్న న్యాయవాది చెప్పారని… అందుకే తాను దీనిపై ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని రమ్య చెప్పారు. అలాగే తనకు ఇప్పుడు కూడా మీడియా అటెన్షన్ ఉండాలన్న కోరిక లేదని… నరేష్ – పవిత్రకే ఎప్పుడు మీడియాలో హైలెట్ అవ్వాలని.. మీడియా ముందు అటెన్షన్ ఉండాలన్న తాపత్రయం ఉంటుందని రమ్య చెప్పారు.

ఇక కృష్ణ చనిపోయినప్పుడు కూడా సెలబ్రిటీలు, మీడియా వాళ్ళ హంగామా ఉన్నప్పుడు మాత్రమే నరేష్ – పవిత్ర కనిపించాలని… సాధారణ కృష్ణ అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చినప్పటికే వారిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారని రమ్య ఆరోపించారు. ఏదేమైనా నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేసిన వెంటనే.. రమ్య ఇంటర్వ్యూ ఇవ్వటం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news