భారతీయ సినిమాల్లో ఇప్పుడు లిప్ కిస్సులు చాలా సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు లిప్ కిస్సులు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు కూడా లిప్ కిస్‌లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు లిప్ కిస్సులు లేని సినిమాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కుర్ర హీరోయిన్లు.. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ల వరకు అందరూ కూడా మూతి ముద్దులు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మూతి ముద్దులు ఇస్తున్న హీరోయిన్ల కే బాగా క్రేజ్ ఉంటుంది. అలాగే దర్శకులు కూడా సీన్ డిమాండ్ చేసిందంటూ హీరోలు.. హీరోయిన్లతో మూతి ముద్దులు పెట్టించేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా ఇప్పుడు లిప్ కిస్‌లకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ఓకే చెపితేనే పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. లేకపోతే ఎవరైనా ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడి పోవాల్సిందే. బాలీవుడ్ లో సారా అలీఖాన్ – జాన్వి కపూర్ లాంటి వారసురాళ్లు కూడా ఇప్పుడు ఈ లిప్ కిస్ల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
మరీ విచిత్రం ఏంటంటే పెళ్లయిన హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇలాంటి బోల్డ్ సీన్లలో నటించటం రొటీన్ అయిపోయింది. ఎవరో ఎందుకు ? సమంత – నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాకే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు ఎంత ఘాటైన లిప్ కిస్ ఇచ్చిందో మనమందరం చూసాం. అదే 25 సంవత్సరాల క్రిందట ఒక స్టార్ హీరోయిన్.. ఒక హీరోకు లిప్ కిస్ ఇచ్చింది అంటే పరిస్థితి ఎలా ? ఉండేదో దానిపై ఎంత పెద్ద చర్చ జరిగి ఉంటుందో ? ఊహించుకోవచ్చు.
అప్పట్లో అసలు హీరోయిన్లు స్మాల్ ఎక్స్పోజింగ్ చేసిన అమ్మో అని లొట్టలేసుకుని మరి చూసేవారు. అలాంటి టైంలో లిప్ కిస్. అందులోనూ స్టార్ హీరోయిన్, హీరో పెదవి పెదవి కలపటం అంటే మామూలు సంచలనం కాదు. అయితే అలాంటి సంచలనానికి కారణమైన లిప్ కిస్ ‘ దయావన్ ‘ సినిమాలో ఉంటుంది. 1988లో ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో వినోద్ కన్నా – మాధురి దీక్షిత్ జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వినోద్ – మాధురి మధ్య గాడమైన లిప్ కిస్ సంచలనంగా నిలిచింది.
అప్పటికే మాధురి దీక్షిత్ పెద్ద డిమాండ్ ఉన్న క్రేజీ హీరోయిన్. అలాంటి హీరోయిన్.. హీరోతో కలిసి గాఢమైన లిప్ కిస్ ఇవ్వటం ఇప్పటికీ పెద్ద హాట్ టాపిక్. ఈ విషయమై ఇప్పటికి మాధురిని చాలామంది జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు. అయితే మాధురికి ఆ లిప్ కిస్ ఇవ్వటం ఇష్టం లేకపోయినా కోటి రూపాయల డబ్బులు కళ్ళ ముందు కనపడుతూ ఉండేసరికి ఆమె నో చెప్పలేక పోయిందట.
అప్పట్లో ఇండియన్ సినిమా హిస్టరీలో కోటి రూపాయలు తీసుకునే ఏకైక నటుడు అమితాబచ్చన్. అప్పట్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే ఇప్పటి లెక్కల ప్రకారం కచ్చితంగా రు. 25 కోట్ల పైమాటే. అంటే ఒక్క లిప్ కిస్ ఖరీదు రు. 25 కోట్లు పలికిందని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్ని లిప్ కిస్‌లు వచ్చినా… ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లిప్ కిస్ చాలా కాస్ట్లీదిగా నిలిచిపోయింది.