యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఫ్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన లవ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గీతాగోవిందం అనే సినిమాతో మొదటిసారి తెరపై జంటగా కనిపించిన వీళ్ళిద్దరూ ఆ సినిమాలో నటించిన నటనకు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకు జనాల ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే విజయ్ – రష్మిక ప్రేమించుకుంటున్నారు అంటూ ట్రెండ్ చేశారు .
కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలోను అదే రేంజ్ లో హైపర్ఫార్మెన్స్ చూపిస్తూ ఏకంగా లిప్ కిస్ ఇస్తూ కుర్రాలను టెంప్ట్ చేశారు . ఈ సినిమా తర్వాత విజయ్ – రష్మిక ప్రేమించుకుంటున్నారు అంటూ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయారు జనాలు . అయితే మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ రష్మిక – విజయ్ ఎప్పటికప్పుడు ఆ విషయాలపై క్లారిటీ ఇస్తున్నా .. కానీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు రోజు రోజుకి ఎక్కువగా వినిపిస్తున్నాయి .
రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా మాల్దీవ్స్ నుంచి క్రేజీ ఫోటోను షేర్ చేసిన విజయ్ దేవరకొండ ..ఆ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్లయింది. ఎందుకంటే రష్మిక మందన కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ రష్మిక మందన..” నేను విజయ్ కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తాం” అంటూ క్రేజీ హింట్ ఇచ్చింది . దీంతో విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలో నటించబోతుందా..? లేక విజయ్ దేవరకొండ తో జీవితాంతం పయనించ బోతుందా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఆ గుడ్ న్యూస్ రష్మిక ఎప్పుడు చెబుతుందో ..?