విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ డ్యాన్స్‌లకు ప్రత్యేకత ఉంది. చేతులుకాళ్లు ఊపుతూ.. ఆయన చేసే హావభావాలు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. అయితే… కొన్నాళ్ల తర్వాత.. అన్నగారు ఒళ్లు చేశారు. దీంతో డ్యాన్స్‌ల్లో ఎక్కువగా ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఇది మైనస్ అయింది. దీంతో డూపులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే.. గజదొంగ, యుగంధర్ వంటి సినిమాల విషయంలో అప్పటికే అన్నగారు 50+ కావడంతో డ్యాన్స్‌లు కాదనలేరు. అలాగని చేయాలంటే.. పొట్ట అడ్డం. దీంతో ఆయన ఒళ్లంతా తిప్పేసేవారు. ముఖ్యంగా పిరుదుల భాగాన్ని.. ఈ సమయంలో అన్నగారు బాగా ఉపయోగించుకున్నారు. ఇది ఒకటో నెంబరు బస్సు.. పాటలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా గజదొంగలోనూ కనిపిస్తుంది.
అంటే.. ఆయన కదలకుండా కేవలం ఒళ్లంతా తిప్పుతూ.. ఆయా పాటల్లో అభినయించేవారన్న మాట. తర్వాత కాలంలో కొన్ని సినిమాల్లో ఇది ఇబ్బందిగా అనిపించేది అయినా.. అన్నగారికి ఆఫర్లు తగ్గలేదు. కానీ, ఏ ఇద్దరు దర్శకులు తారసపడినా వెంటనే.. అన్నగారి హావభావాల గురించిన చర్చ వచ్చేది. ఈ సమయంలోనే అక్కినేనితో పోల్చుకునివారు సటైర్లు వేసేవారు.
“ఎన్టీఆర్ మొత్తం ఒళ్లంతా ఊపుతాడయ్యా.. అక్కినేని కేవలం నడుం మాత్రమే ఊపుతాడు. చూసేందుకు నాజూగ్గా ఉంటుంది“ అని అప్పట్లో దర్శకుల మధ్య కామెంట్లుకురిసేవి. అయితే ఎన్టీఆర్ ఎంత ఒళ్లు చేసినా ఆయన హవభావాలు, డైలాగులు, యాక్షన్ అంటేనే కళ్లు చెదిరిపోయే స్థాయిలో ఉండేది. ఇదీ.. సంగతి..!