తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎలక్షన్స్ చాల రసవత్తరంగా సాగె అవకాశం ఉంది. 2019 ఎలక్షన్ బరిలో సాధారణ రాజకియ నాయకులతో పాటు మరో ఇద్దరు అగ్రకథానాయకులు కూడా పోటీ చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికలు మొదలు అయ్యే లోగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి ఒక పొలిటికల్ సినిమా రాబోతున్న సంగతి విదితమే. అయితే ఆ సినిమా త్రివిక్రమ్ మూవీ పూర్తయిన మూడు నెలలకు కానీ పట్టాలెక్కే అవకాశం లేదని సినీ వర్గాల సమాచారం.
అయితే అదే సమయంలో టాలీవుడ్ లో మిగిలిన సినిమా కథలు కూడా రాజకీయ నేపధ్యం మీదే తెరకెక్కనుండటం విశేషం. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక సరికొత్త కథకి శ్రీకారం చుట్టాడు. తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సీనియర్ ఎన్టీఆర్ కథని ఆధారంగా తీసుకొని ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి కోణం లో ఈ సినిమా ఉండబోతోంది అని సమాచారం.
వీరికంటే ముందే నందమూరి బాలకృష్ణ ఒక భారీ పొలిటికల్ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తన తండ్రి ఎన్టీఆర్ మీద బయోపిక్ కి బాలయ్య సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. కానీ దానికంటే ముందరే బాలయ్య జై సింహ తో పొలిటికల్ హీట్ ని పెంచబోతున్నాడు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్టీఆర్ విగ్రహం, చుట్టూ ప్రజల ఆందోళన.. మధ్యలో బాలయ్య. ఈ ఒక్క సన్నివేశం చూస్తే సినిమా మొత్తం రాజకీయ నేపధ్యం చుట్టూనే సాగనుందని తెలుస్తుంది.