సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు ..స్టార్ సన్స్ హీరోలుగా రాజ్యమేలుతున్నారు. అయితే అందరిలోకి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే చాలామంది జనాలకు ప్రత్యేకమైన అభిమానం. ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడుతాడు అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . కాగా నీతి నిజాయితీకి మరో పేరు అన్న సూర్య కూడా లైఫ్లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడన్న న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఇది అందరికీ తెలిసిన న్యూస్ . తెలియని న్యూస్ ఏందంటే సూర్య అఫీషియల్ గా జ్యోతికను పెళ్లి చేసుకోక ముందే అన్ అఫిషియల్ గా గుడిలో ఆమె మెడలో తాళి కట్టారు . ఇదే న్యూస్ తెలుసుకున్న సూర్య పేరెంట్స్ షాక్ అయ్యారు మందలించి తర్వాత అఫీషియల్ గా పెళ్లి చేశారు . సినిమాలో నటిస్తున్న టైంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డ సూర్య జ్యోతిక ..ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడ్డారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తండ్రిని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేని సూర్య.. జ్యోతికను వదులుకోవటం ఇష్టం లేక ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు .
కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన వీళ్ళ పెళ్లి వ్యవహారం ఎట్టకేలకు ఇంట్లో లీక్ అయిపోయింది . సూర్య-జ్యోతిక ను మందలించి చివాట్లు పెట్టి మళ్లీ అఫీషియల్ గా అందరికీ తెలిసేలా పెళ్లి చేశారు . ఈ క్రమంలోనే కోలీవుడ్ మీడియాలో అప్పట్లో వీళ్ళ పెళ్లి మేటర్ సంచలనంగా మారింది . అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూర్య ఇప్పటికీ ఆ తప్పు ఎందుకు చేశానా అని బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కొంచెం ఆలోచించి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఉంటే నా లైఫ్ లో ఇది రి మార్క్ కూడా ఉండేది కాదు అంటూ బాధపడ్డాడు . లైఫ్ లో సరిదిద్దుకోవాలని తప్పు చేసానని నాలా ఎవరు తప్పు చేయొద్దని ఫాన్స్ కి సజీషన్స్ ఇచ్చాడు . నిజంగా ప్రేమిస్తే ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి అంటూ సలహా ఇచ్చాడు.