నిజంగా తెలుగమ్మాయికి ముద్దు పెట్టడం ఇష్టముండదా..నమ్మేలా లేదే..! అవును సినిమా హీరోయిన్ అన్న తర్వాత అన్నిటికీ ఒకే అనుకొనే ఇండస్ట్రీకొస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, కొందరు హీరోయిన్స్ మాత్రం ఒడ్డు చేరిన తర్వాత తెడ్డు విసిరేసినట్టు స్టార్ ఇమేజ్ వచ్చాకో లేకపోతే వరుస ఫ్లాపులొచ్చాక పక్కన పడేస్తేనో మమ్మల్ని వాడుకున్నారని లిస్ట్ బయటపెడుతుంటారు.
సుచీ లీక్స్, శ్రీరెడ్డి మరికొందరు సౌత్ అండ్ బాలీవుడ్ నటీమణులు. వీరంతా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అవగాహన తెచ్చుకున్న తర్వాతే వచ్చి మేకప్ టెస్ట్..ఆడిషన్స్‌లో పాల్గొంటారు. సినిమాకి సైన్ చేసే ముందే అన్నీ కండీషన్స్ తెలుసుకుంటారు. కథ విన్నప్పుడే సినిమాలో ఎన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. హీరోతో ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి..అని క్లారిటీ వచ్చేస్తుంది.
అంతేకాదు, సీన్స్‌లో గానీ, సాంగ్స్‌లో గానీ ఎన్ని పెదవి ముద్దులు ఉన్నాయో అర్థం అవుతుంది. దర్శకనిర్మాతలు ఈ విషయాన్ని చాలా స్పష్ఠంగా చెబుతారు. అయితే, రాజోలు అమ్మాయి..అచ్చ తెలుగు హీరోయిన్ మాత్రం హీరోతో ముద్దు సన్నివేశంలో నటించాక చాటుకెళ్ళి ఏడ్చిందట. ఇది వినడానికి మరీ కామెడీగా ఉంది. అంజలి తెలుగులో అవకాశాలు రాక తమిళంలో ఆడిషన్స్ ఇచ్చి అక్కడ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది.
జర్నీ లాంటి సినిమాలతో అక్కడ బాగా పాపులర్ అయ్యాక తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు అందుకొని ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి బాగానే సెటిలైంది. తెలుగులో బాలయ్య డిక్టేటర్, వెంకీ మసాలా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో పాటు ఇటు కుర్ర హీరోల పక్కన కూడా బాగా రొమాన్స్ చేసింది.
ఇవన్నీ బాగానే ఉన్నా ముద్దు సీన్‌లో నటించి ఏడవడం ఏంటో మరీ విడ్డూరంగా ఉంది. అంజలి అంటే మాస్ హీరోయిన్ అనే పేరుంది. ఈ మాస్ హీరోయిన్ నుంచి జనాలు కావాలనుకునేది అదే కదా.