ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలు అంతా కూడా ఇపుడు తమ వయసుని మించిన పాత్రలు చేస్తూ డెడికేషన్‌తో తమ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఫ్యాన్స్ ను మెప్పించేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. బాలయ్య, చిరంజీవి లాంటి వాళ్లు ఆరు పదులు దాటేసినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. అసలు చిరంజీవి వయస్సు మరో రెండేళ్లలో ఏడు పదులకు చేరువులో ఉంది. అయితే ఈ వయస్సులోనూ ఆయన మెయింటైన్ చేస్తోన్న స్టైల్, ఫిజిక్, లుక్ చూస్తుంటే కుర్ర హీరోలు ఎందుకు సరిపోరేమో అన్నట్టుగా ఉంది.
తాజాగా చిరు నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రెస్‌మీట్లో చిరు మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించడం కోసమే కెమేరా ముందుకు వచ్చానని.. తాను కెమేరా ముందు ఉన్నంత వరకు నటుడిగా ఎంతవరకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమే అని ప్రకటించారు.
ఆ షూట్ అయ్యాక తన బాధలు తాను పడతానని.. అయితే అభిమానులను అలరించేందుకు షూటింగ్‌లో ఎంత బాధని అయినా భరిస్తానని.. అప్పుడు మాత్రం దానిని అస్సలు భయటకు వ్యక్తం చేయనని అన్నారు. ఇక తాను సినిమాలలో నటించలేకపోతున్నాను అని అనిపిస్తే ఆ రోజే తాను సినిమాల నుంచి తప్పుకుంటాను అని… అప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని వ్యాఖ్యానించారు.
అయితే అలాంటి రోజు ఒక నటుడు జీవితంలో ఎప్పుడూ ఉండకూడదని కూడా చిరు చెప్పారు. తాము ఇక్కడకు కష్టపడడానికే వచ్చామని… ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. నిలబడినప్పుడే ఉన్నత స్థానాలకు వస్తామని.. అలా కాదు అనుకుంటే గెట్ లాస్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ.. వారు వెళ్లిపోవచ్చు అని చిరు తెలిపారు. ఏదేమైనా చిరు శ్వాస ఉన్నంత వరకు నటించాలనే తాపత్రయంతోనే ఉన్నారని ఆయన మాటలు చెప్పకనే చెపుతున్నాయి.