బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ చనిపోవడం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు ఎంతో మందిని తీవ్రంగా కలిసి వేసింది. భారత మాజీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్ లో నటించి ఎంతోమంది యువకుల ఆరాధ్య హీరోగా ఒక వెలుగు వెలిగిన సుశాంత్ చనిపోయాక, అతడి మరణంతో పాటు వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక కథనాలు వచ్చాయి.
ఇక సుశాంత్ ది హత్యలేక ఆత్మహత్య అన్న కోణంలో ముందుగా ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత ఈ కేసును సిబిఐకు అప్పగించారు. ఇప్పటివరకు ఈ కేసు విచారణ పూర్తి కాలేదు. దీనిపై కూడా రకరకాల ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ మృతిపై హత్య అన్న కోణంలో ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. సుశాంత్ పోస్టుమార్టంలో పాల్గొన్న ముంబై కూపర్ హాస్పిటల్ సిబ్బంది ఇప్పుడు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతుంది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. అతడిని ఎవరో హత్య చేశారని కూపర్ హాస్పిటల్ లోని మార్చురీలో పనిచేసిన రూప కుమార్ షా సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మృతదేహం వచ్చినప్పుడు.. అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని.. అతడిని ఎవరో కొట్టారని రూప కుమార్ ఆరోపించారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిగినప్పుడు కూడా తాను అక్కడే ఉన్నానని.. ఇది ఆత్మహత్య కాదని… హత్య అని డాక్టర్ కి చెప్పినా.. తన సూచనలను ఎవరు పట్టించుకోలేదని రూప్ కుమార్ అన్నారు.
అయితే ఈ విషయాన్ని రూపకుమార్ ఇప్పటివరకు ఎందుకు దాచి పెట్టారు అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో తాను ఇంతసేపు మాట్లాడలేదని.. తాను నెలన్నర క్రితం పదవి విరమణ చేశానని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి బెయిల్‌పై రిలీజ్ అయ్యింది.
అయితే ఆమె ఫోన్‌కాల్‌కు ఏయూ అన్న నెంబర్ నుంచి 44 ఫోన్ కాల్స్ వచ్చినట్టు బిహార్ పోలీసులు తెలిపారు. ఏయూ అంటే ఆదిత్య థాక్రే అని కూడా వారు చెప్పడం కలకం రేపింది. అందుకే ఆదిత్య థాక్రే పాత్రపై కూడా అప్పట్లో చాలా అనుమానాలు, సందేహాలు పోలీసులు వ్యక్తం చేశారు. అప్పుడు ఆదిత్య మంత్రిగా ఉన్నారు.