టాలీవుడ్లో ఈ శుక్రవారం ఇద్దరు క్రేజీ హీరోలు నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మాస్ మహరాజ్ రవితేజ ధమాకా సినిమాతో పాటు, మరో క్రేజీ హీరో నిఖిల్ నటించిన 18 పేజెస్ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే రెండు సినిమాలపై మంచి హైప్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోల్లో ఏ హీరో సినిమా పై చేయి సాధించిందో రెండో రోజులకే కాస్త క్లారిటీ వచ్చేసింది.
ముందుగా చూస్తే ఈ యేడాది ఇప్పటికే రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు చూసిన రవితేజ ముచ్చటగా ధమాకా సినిమాతో మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్లో మరో సాలిడ్ కం బ్యాక్ సినిమాగా నిలిచింది.
తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రు. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా … రెండో రోజు రు. 9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు రోజులకు వరల్డ్ వైడ్‌గా రు. 19 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా సినిమాకి మంచి నంబర్స్ నమోదు అవుతున్నట్టుగా ట్రేడ్ టాక్. ఇక ఓవర్సీస్లో అయితే 1.50 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టి స్ట్రాంగ్‌గా దూసుకుపోతోంది.
ఇక నిఖిల్ 18 పేజెస్ విషయానికి వస్తే ఈ సినిమాకు సుకుమార్ బ్యాక్ బోన్‌గా ఉన్నారు. పైగా జీఏ 2 బ్యానర్. అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మాణంలో వచ్చింది. కుమారి 21 ఎఫ్ దర్శకుడు పలనాటి సూర్యప్రతాప్ డైరెక్టర్. కార్తీకేయ 2 లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ సినిమా ఇది. పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే తొలి రెండు రోజులకు ఏపీ, తెలంగాణలో రు 4.45 కోట్ల గ్రాస్‌తో పాటు 2.28 కోట్ల షేర్ వచ్చింది. రు. 6 కోట్లకు పైగా గ్రాస్… రు. 3 కోట్ల షేర్ వచ్చింది.
ఓవరాల్‌గా చూస్తే నిఖిల్ సినిమాతో పోలిస్తే రవితేజ సినిమా పూర్తి ఆధిపత్యం చాటింది. నిఖిల్ సినిమాకు రు. 13 కోట్ల నెట్ వసూళ్లు రావాలి. ఇప్పుడున్న పెర్పామెన్స్‌తో చూస్తే ఇది కష్టం. దీనిని బట్టి నిఖిల్‌పై రవితేజ విన్ అయినట్టే..!